సారీ చెప్పిన రాంచరణ్


Ramcharan says sorry to his fans

వినయ విధేయ రామ చిత్రం డిజాస్టర్ కావడంతో మెగా అభిమానులకు సారీ చెప్పాడు హీరో రాంచరణ్ . మేము ఎంతో కష్టపడి మీకొక మంచి చిత్రం అందించాలని అనుకున్నాం , శక్తివంచన లేకుండా కృషి చేసాం కానీ మీ అంచనాలను అందుకోలేక పోయాం అంటూ క్షమాపణ పత్రాన్ని రిలీజ్ చేసాడు రాంచరణ్ . జనవరి 11న వినయ విధేయ రామ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే .

 

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో నిర్మించాడు డివివి దానయ్య . చరణ్ సరసన కియారా అద్వానీ నటించిన ఈ చిత్రం మెగా అభిమానులను తీవ్రంగా గాయపరిచింది . రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇలాంటి చెత్త చిత్రం ఎలా ఒప్పుకున్నాడు అంటూ చరణ్ పై కూడా మండిపడ్డారు మెగా ఫ్యాన్స్ . దాంతో వాళ్ళని క్షమించాలంటూ ఇకపై చేసే సినిమాలు జాగ్రత్తగా చేస్తానని హామీ ఇచ్చాడు చరణ్ . ఫ్యాన్స్ కేమో ఒకరకమైన ఇబ్బంది అయితే బయ్యర్లు మాత్రం ఆర్ధికంగా నష్టపోయారు ఈ సినిమాని కొని .

English Title: Ramcharan says sorry to his fans