విష‌యం తెలిసి థ్రిల్ల‌య్యాను : మెగాస్టార్

విష‌యం తెలిసి థ్రిల్ల‌య్యాను : మెగాస్టార్
విష‌యం తెలిసి థ్రిల్ల‌య్యాను : మెగాస్టార్

శుక్ర‌వారం సాయంత్రం దిగ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ – మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ల క‌ల‌యిక‌లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెర‌పైకి రానుంద‌ని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌క్రియేష‌న్స్ అధినేత‌లు దిల్‌రాజు, శిరీష్ అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. సౌత్ ఇండియాలోనే తెర‌పైకి రానున్న అతి పెద్ద ప్రాజెక్ట్‌ల‌లో ఈ మూవీ ఒక‌టిగా నిల‌వ‌బోతోంది. అంతే కాకుండా శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌క్రియేష‌న్స్ సంస్థ నిర్మించ‌నున్న 50వ చిత్రం, రామ్‌చ‌ర‌ణ్ 15వ చిత్రం కావ‌డంతో ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌గానే టాలీవుడ్ వ‌ర్గాల్లో చాలా మంది ఆశ్చ‌ర్యానికి, థ్రిల్‌కి లోన‌య్యారు. మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రాజెక్ట్ గురించి తెలిసి థ్రిల్ల‌య్యార‌ట‌. ఈ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించ‌గానే సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారా‌య‌న‌. శంకర్ ద‌ర్శ‌‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ మూవీ అన‌గానే థ్రిల్ల‌య్యాన‌ని అన్నారు. అద్భుత‌మైన టాలెంట్‌లో భార‌తీయ చిత్రాన్ని ప్ర‌పంచ ప‌టంలో నిలిపిన ద‌ర్శ‌కుడు శంక‌ర్ అని అటువంటి ద‌ర్శ‌కుడితో చ‌ర‌ణ్ సినిమా చేయ‌బోతుండ‌టం ఎంతో ఆనందాన్ని క‌లిగిస్తోంద‌న్నారు.

అద్భుత‌మైన ద‌ర్శ‌కుల‌తో వ‌రుస‌గా చ‌ర‌ణ్ చిత్రాలు చేస్తున్న చ‌ర‌ణ్‌కి బెస్ట్ విషెస్ తెలియ‌జేస్తున్నాన‌న్నారు. ఇంత వ‌ర‌కు త‌మిళ ఇండ‌స్ట్రీకి చెందిన హీరోల‌తో మాత్ర‌మే సినిమాలు చేస్తూ వ‌చ్చిన శంక‌ర్ తొలిసారి ఇత‌ర ఇండ‌స్ట్రీకి సంబంధించిన హీరోతో పాన్ ఇండియా మూవీకి శ్రీ‌కారం చుట్ట‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్‌. దీంతో ఈ మూవీపై స‌హ‌జంగానే భారీ అంచ‌నాల‌తో పాటు ఈ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో వుంటుందో అనే చ‌ర్చ కూడా మొద‌లైంది. శంక‌ర్‌తో `జెంటిల్‌మెన్`హిందీ రీమేక్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి చేసిన విష‌యం తెలిసిందే.