పవన్ కళ్యాణ్ ని ఓదార్చిన చరణ్


బాబాయ్ పవన్ కళ్యాణ్ ని ఓదార్చాడు అబ్బాయ్ రాంచరణ్ . బాబాయ్ ని అబ్బాయ్ ఓదార్చడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన విషయం తెలిసిందే . అయితే ఎపి ఎన్నికల్లో జనసేన చిత్తుచిత్తుగా ఓడిపోయింది , పార్టీ మాత్రమే కాదు బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్లా పోటీ చేస్తే రెండు చోట్లా ఘోరంగా ఓడిపోయాడు .

ఒక్క పవన్ బాబాయ్ మాత్రమే కాదు నాగబాబు బాబాయ్ కూడా ఘోరంగా ఓడిపోయాడు దాంతో ఆ ఇద్దరినీ ఓదార్చాడు రాంచరణ్ తేజ్ . పవన్ కళ్యాణ్ బాబాయ్ కి పెద్ద లక్ష్యం ఉందని , ఆ లక్ష్యం కోసం పోరాటం చేస్తాడే తప్ప ఓటమి తో బాధపడడు అంటూ ఓ సందేశాన్ని పంపాడు . అయితే పవన్ కళ్యాణ్ ఓటమికి స్వయం కృతాపరాధమే కారణం . సమస్యలు పట్ల సరైన అవగాహన లేకుండా మాట్లాడటం , అలాగే ప్రజలకు నమ్మకం కలిగించకపోవడంతో జగన్ కు బ్రహ్మరథం పట్టారు జనాలు .