రాంచరణ్ కండలకు కారణం ఏంటో తెలుసా


Ramcharan's Diet secret revealed
Ramcharan

వినయ విధేయ రామ చిత్రం లో కండలు తిరిగిన దేహంతో రాంబో ని తలపిస్తున్నాడు రాంచరణ్ . అయితే ఇంతగా కండలు తిరిగిన దేహంతో ఆకట్టుకొనే రూపం రావడానికి చరణ్ పడిన కష్టం తో పాటుగా అంతకంటే ఎక్కువగా కష్టపడిన వ్యక్తి ఉపాసన . తన భర్తకు అన్ని వేళలా ఏం కావాలో తెలుసుకొని , దేని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకొని మరీ కస్టపడి వండి పెట్టింది ఉపాసన . ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది . చరణ్ పడిన కష్టంతో పాటుగా ఉపాసన అందించిన ఆహారం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది .

చరణ్ డైట్ విషయాలు ఒకసారి చూద్దామా ! .
ఉదయం ఎనిమిది గంటలకు ఎగ్స్ , ఓట్స్ తో పాటుగా బాదంపాలు ,
11. 30 నిమిషాలకు వెజిటబుల్ సూప్ ,
మధ్యాహ్నం 1. 30 కు 200 గ్రాముల చికెన్ , 3/4 కప్పు బ్రౌన్ రైస్ , సగం కప్పు గ్రీన్ వెజిటబుల్ కర్రీ
సాయంత్రం నాలుగు గంటలకు 250 గ్రాముల గ్రిల్ల్డ్ ఫిష్ , 200 గ్రాముల స్వీట్ పొటాటో , సగం కప్పు గ్రీన్ వెజిటబుల్
ఆరు గంటలకు పెద్ద కప్పు మిక్స్ డ్ గ్రీన్ సలాడ్ , 1/4 అవకాడో , ఒక బౌల్ నిండా గింజలు

మళ్ళీ మధ్యలో ఆరు గంటల నుండి 8 గంటల మధ్యలో ఆకలి వేస్తే గింజలను , పచ్చి కూరగాయలను స్నాక్స్ గా తింటాడట . అయితే రాత్రి 8 దాటిన తర్వాత ఎంత ఆకలి వేసినా ఏం తినలేదట కనీసం పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టలేదట . ఇలా అహోరాత్రులు శ్రమించాడు కాబట్టే కండలను మెలిపెట్టాడు మరి .

English Title: Ramcharan’s Diet secret revealed