జపాన్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న మగధీర


Ramcharans magadheera new sensation in japanపదేళ్ల క్రితం తెలుగునాట ప్రభంజనం సృష్టించిన చిత్రం మగధీర కాగా ఇప్పుడా చిత్రం జపాన్ లో విడుదలైంది . ఆగస్టు 31 న విడుదలైన మగధీర అక్కడ కూడా సంచలనం సృష్టిస్తోంది . జపాన్ లో తెలుగు చిత్రాలకు ఆదరణ లభిస్తోంది అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ముత్తు చిత్రం మాత్రమే 1. 6 మిలియన్ డాలర్లని వసూల్ చేసి చరిత్ర సృష్టించింది అప్పట్లో . దాదాపు 23 సంవత్సరాల క్రితం విడుదలైన ముత్తు అక్కడ ప్రభంజనం సృష్టించగా తాజాగా మగధీర మాత్రమే ఆ రికార్డ్ ని బద్దలు కొట్టింది .

23 ఏళ్ల క్రితం రజనీ ప్రభంజనం సృష్టించగా దాన్ని అధిగమించి మగధీర 1. 77 డాలర్లతో ఇంకా రేసులో దూసుకుపోతోంది . అప్పటి వసూళ్లు ఇప్పటి వసూళ్లు వేరు కానీ మధ్యలో వచ్చిన బాహుబలి , బాహుబలి 2 మాత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయాయి . అయితే మగధీర మాత్రం 2 మిలియన్ డాలర్ల వైపు దూసుకుపోతోంది జపాన్ లో . రజనీకాంత్ , ఎన్టీఆర్ , ప్రభాస్ ల చిత్రాలతో పాటుగా ఇప్పుడు చరణ్ కూడా ఆ హీరోల సరసన నిలిచాడు మగధీర చిత్రంతో . 2009 లో విడుదలైన మగధీర ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల భారీ వసూళ్ల ని సాధించింది . జపాన్ లో మగధీర సంచలనం సృష్టిస్తుండటంతో జపాన్ లోని తన అభిమానులకు , ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపాడు రాంచరణ్ తేజ్ .

English Title:  Ramcharans magadheera new sensation in japan