అవమానంతో కుమిలిపోతున్న బాలయ్య పై బాంబ్ పేల్చిన వర్మ


Ramgopal varma controversial comments on balakrishna

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి నాకు స్ఫూర్తి నందమూరి బాలకృష్ణ అందుకే ఈ సినిమాని బాలయ్యకు అంకితం ఇస్తున్నా అంటూ బాంబ్ పేల్చాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ . అసలే ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు కూడా ఘోర పరాజయం పొందడంతో అవమాన భారంతో కుమిలిపోతున్నాడు బాలకృష్ణ . సరిగ్గా ఇలాంటి సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతుంటేనే నందమూరి కుటుంబంలో అల్లకల్లోల జరుగుతోంది అలాంటిది ఇప్పుడు వర్మ బాలయ్య పై వేసిన సెటైర్ తో మరింత అవమానం జరిగింది .

 

ఎన్టీఆర్ బయోపిక్ తీయాలని బాలయ్య అనుకున్నప్పుడు పలువురు దర్శకులను సంప్రదించాడట అందులో వర్మ కూడా ఒకరు . అయితే లక్ష్మీపార్వతి ఎపిసోడ్ లేకుండా సినిమా చేయలేమని బాలయ్యతో వాదించాడట వర్మ . అక్కడ వచ్చిన విబేధాలతోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ కి రూపకల్పన చేసాడు వర్మ . ఇక ఈ సినిమా ఈనెల 22న రిలీజ్ కానుంది . రిలీజ్ అయ్యాక ఇంకా ఎన్ని అవమానాలకు గురిచేస్తుందో బాలయ్య కుటుంబాన్ని .

English Title : Ramgopal varma controversial comments on balakrishna