స్టార్ హీరోలను ఘోరంగా అవమానించాడు

Ramgopal varma insults star herosస్టార్ హీరోలను హీరోయిన్ లతో పోల్చుతూ ఘోరంగా అవమానించాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక ఈనెల 25న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. వీరనారి ఝాన్సీ లాక్ష్మీభాయి పాత్రలో నట విశ్వరూపం చూపించింది కంగనా రనౌత్ దాంతో కంగనా నటనా శక్తిని కీర్తిస్తూ స్టార్ హీరోలను హీరోయిన్ లతో పోల్చాడు.

అంతేనా ….. కంగనా రనౌత్ ని ఏకంగా హీరో అనేసాడు. కంగనా ని పొగడటంలో తప్పు లేదు కానీ స్టార్ హీరోలను ఎందుకు అవమానించాల్సి వచ్చిందో ! ఇంకేముంది వర్మకు వివాదం కావాలి. అందుకే కంగనా ని పొగుడుతూ స్టార్ హీరోలను విమర్శించాడు వర్మ. నిత్యం ఎవరో ఒకరిపై విమర్శలు చేయడమే వర్మ పని.

 

English Title: Ramgopal varma insults star heros