మహర్షి సినిమాపై సెటైర్ వేసిన రాంగోపాల్ వర్మ


మహేష్ బాబు నటించాడు కాబట్టి మహేష్ బాబు కోసం మహర్షి సినిమాని చూస్తున్నారు కానీ లేకపోతే ఆ సినిమాని ఎవడు చూస్తాడు అంటూ సంచలన కామెంట్ చేసాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి చిత్రం ఈనెల 9 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాకు ఓవర్ సీస్ లో దెబ్బపడింది అలాగే రాయలసీమ లో కూడా .

దాంతో మహర్షి సినిమాపై సెటైర్ వేసాడు రాంగోపాల్ వర్మ . సినిమా కు జనాలు వచ్చేది వినోదం కోసం అంతేకాని సందేశం ఇస్తే చూడటానికి కాదు కాకపోతే మహర్షి చిత్రాన్ని మహేష్ కోసమే చూస్తున్నారు లేకపోతె ఆ సినిమా ఎవడు చూస్తాడు ? అంటూ దారుణమైన కామెంట్ చేసాడు . ఇక నేను వినోదం కోసమే సినిమా చేస్తాను తప్పితే సందేశం కోసం చేయనని , ఇప్పటివరకు సందేశాత్మక చిత్రాలు చేయలేదని అంటున్నాడు రాంగోపాల్ వర్మ .