కేసీఆర్ బయోపిక్ పేరు చెప్పి సంచలనం సృష్టించిన వర్మ


కేసీఆర్ బయోపిక్ పేరు చెప్పి సంచలనం సృష్టించాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ . ఇంతకీ కేసీఆర్ బయోపిక్ టైటిల్ ఏంటో తెలుసా …… ”టైగర్ కేసీఆర్ ” . టైటిల్ మాత్రమే కాదు ట్యాగ్ లైన్స్ కూడా బ్రహ్మాండంగా పెట్టేసాడు వర్మ . ది అగ్రెసివ్ గాంధీ , ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు అనేది ట్యాగ్ లైన్ . టైటిల్ , ట్యాగ్ లైన్ లతోనే కేసీఆర్ బయోపిక్ పై అంచనాలు పెంచాడు వర్మ .

 

అయితే గతకొంత కాలంగా వర్మ తీస్తున్న చిత్రాలకు వివాదాలు హెల్ప్ అవుతున్నాయి తప్ప ఆశించిన స్థాయిలో అయితే సినిమాలు ఉండటం లేదు . ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ తో కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకున్నాడు ఆరంభం అదిరింది కానీ ఆ తర్వాత ఆ సినిమాకు కలెక్షన్లు లేకుండా పోయాయి . ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే రిలీజ్ కాలేదు కూడా . ఇక ఇప్పుడేమో కేసీఆర్ బయోపిక్ అంటూ ప్రకటన జారీ చేసాడు వర్మ . మరి ఈ సినిమా ఎలా ఉంటుందో ? ఎలా తీస్తాడో ?