`ఆర్ఆర్ఆర్` ఫ్లాపైతే పండ‌గ చేసుకునేదెవ‌రు?


`ఆర్ఆర్ఆర్` ఫ్లాపైతే పండ‌గ చేసుకునేదెవ‌రు?
`ఆర్ఆర్ఆర్` ఫ్లాపైతే పండ‌గ చేసుకునేదెవ‌రు?

సంచ‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్‌గోపాల్‌వ‌ర్మ‌. వివాదం ఎక్క‌డ వుంటే ఎక్క‌డే వ‌ర్మ చ‌లికాచుకుంటాడ‌న్న‌ది ఇండ‌స్ట్రీ జ‌నాలు ఎరిగిన స‌త్యం. తాజాగా ఇండ‌స్ట్రీపై, ఇండ‌స్ట్రీ యూనిటీపై వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. లాక్డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన షూటింగ్‌ల‌ని వెంట‌నే ప్రారంభించాల‌ని, థియేట‌ర్ల‌ని కూడా తిరిగి ఓపెన్ చేయాల‌ని ఇందుకు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో చిరంజీవి నేతృత్వంలో ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ప‌లు మీటింగ్‌లు కండ‌క్ట్ చేయ‌డం, దానిపై బాల‌కృష్ణ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే.

ఇంత జ‌రుగుతున్నా ఇండ‌స్ట్రీ అంతా ఒక‌లే న‌న‌ని అంతా చెబుతున్నారు. అయితే ఈ స్టేట్‌మెంట్ల‌పై వ‌ర్మ ఓ మీడియా వేదిక‌గా స్పందించారు. చిత్రప‌రిశ్ర‌మ‌లో ఐక్య‌త గురించి మాట్లాడే వ‌న్నీ అబ‌ద్దాలేన‌ని, ఇక్క‌డ వెండితెర‌పైనే కాదు నిజ‌జీవితంలోనూ న‌టించే వాళ్లున్నార‌ని, వృత్తిప‌ర‌మైన అసూయ ప్ర‌తీచోటా వుంద‌ని అయితే ఇక్క‌డ మ‌రీ ఎక్కువ‌గా వుంద‌ని చెప్పుకొచ్చారు. కొంత మంది స్టార్‌లుఇత‌ర స్టార్‌ల సినిమాలు ఫ్లాప్ అయితే ర‌హ‌స్య ప్రాంతాల్లో పార్టీలు చేసుకుంటార‌ని కామెంట్ చేశారు.

అంతేనా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న రాజ‌మౌళి `ఆర్ఆర్ఆర్`‌తో ఫ్లాప్‌ని ఎదుర్కొన్నా ఇండ‌స్ట్రీలో పార్టీలో చేసుకునేవాళ్లున్నార‌ని బాంబు పేల్చారు. త‌న తాజా చిత్రం `క్లైమాక్స్‌` ప్ర‌మోష‌న్ కోసం ఓ మీడియా ఛాన‌ల్‌తో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన ఆర్జీవీ తాజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.