రంప‌చోడ‌వ‌రంలో `పుష్ప‌`రాజ్‌కు ఏం జ‌రిగింది?

Rampachodavaram fans grand welcome to Allu arjun 
Rampachodavaram fans grand welcome to Allu arjun

అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `పుష్ప`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో పుష్ప‌రాజ్‌గా నెవ్వ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ త‌ర‌హా ఫుల్ మాస్  పాత్ర‌లో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో క‌లిసి ముత్యంశెట్టి మీడియా నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది.

తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 13న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం మారేడుమిల్లి, రంప‌చోడ‌వ‌రం డీప్ ఫారెస్ట్‌ల‌లో జ‌రుగుతోంది. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో హీరో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా ప‌క్కా మాసీవ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన రిలీజ్ పోస్ట‌ర్‌లో ఎండిపోయిన మొద‌లుపై చింపిరి జుట్టుతో మాసిన బ‌ట్ట‌ల‌తో చేతిలో గొడ్డ‌లి ప‌ట్టుకుని క‌నిపిస్తున్న బ‌న్నీ లుక్ సినిమాపై భారీ అంచనాల్ని పెంచేసింది.

తాజాగా ఈ మూవీ షూటింగ్ రంప‌చోడ‌వ‌రంలో జ‌రుగుతోంది. ఇందు కోసం బ‌న్నీ రాత్రి వెళుతుండ‌గా విష‌యం తెలిసిన రంప‌చోడ‌వ‌రం ప్ర‌జ‌లు బ‌న్నీకి ఎదురుగా వ‌చ్చి స్వాగ‌తం ప‌లికారు. రాత్రి చీక‌ట్లో సెల్ ఫోల్ లైట్ వెళుతురులో త‌న‌కి వెల్క‌మ్ చెప్పిన ఫొటోని బ‌న్నీ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా `థ్యాంక్యూ రంప‌చోడ‌వ‌రం` అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఈ ఫొటో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.