50 కోట్ల క్లబ్ లో ఇస్మార్ట్ శంకర్


ismart shankar collections 50cr
ismart shankar poster

ఇస్మార్ట్ శంకర్ చిత్రం 50 కోట్ల దిశగా దూసుకుపోతోంది. జూలై 18న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 48 కోట్లు వసూల్ అయినట్లు ప్రకటించారు. ఈ స్థాయి వసూళ్లు నిజంగా వచ్చాయా లేక సదరు సంస్థ ఊరికే ప్రకటిస్తుందా అన్నది పక్కన పెడితే ఇస్మార్ట్ శంకర్ చిత్రం అయితే హిట్ అన్నది వాస్తవం. అయితే కలెక్షన్స్ మాత్రం మరీ ఎక్కువ చేసి చూపిస్తున్నారు అన్నమాట వినబడుతోంది.

ఇక ఈ సినిమా హిట్ కావడంతో హీరో రామ్ తో పాటుగా ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి అసలు సిసలైన విషమ పరీక్ష ఈరోజు నుండి ఎదురుకానుంది . ఈరోజు నుండి కలెక్షన్స్ డ్రాప్ కానున్నాయి. అయితే వసూళ్లు తగ్గినా ఇప్పటికే ఇస్మార్ట్ ని కొనుక్కున్న వాళ్లకు లాభాలు వచ్చి పడ్డాయి. దాంతో బయ్యర్లు అలాగే నిర్మాతలు సంతోషంగా ఉన్నారు. ఇక పూరి ఆనందానికి అంతేలేకుండా పోయింది.