మొత్తానికి రామ్‌కు విజ‌య్ డైరెక్ట‌ర్ ఫైన‌ల్‌?


మొత్తానికి రామ్‌కు విజ‌య్ డైరెక్ట‌ర్ ఫైన‌ల్‌?
మొత్తానికి రామ్‌కు విజ‌య్ డైరెక్ట‌ర్ ఫైన‌ల్‌?

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌` వంటి మాస్ మాసాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో మాసీవ్ హిట్‌ని త‌న ఖాతాతో వేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీతో ఎన‌ర్జిటిక్ స్టార్ కాస్త ఉస్తాద్‌గా మారిపోయాడు. దీంతో ల‌వ‌ర్ బాయ్‌, చాక్లెట్ బాయ్ ఇమేజ్‌కి దూరంగా మాస్ మాసాలా ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌డం మొద‌లుపెట్టారు, ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన మాస్ థ్రిల్ల‌ర్ `రెడ్‌`.

కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఓపెనింగ్స్‌ని రాబ‌ట్టింది. ఫ‌లితం ఆశించిన స్థాయిలో రాక‌పోయినా ఓపెనింగ్స్ మాత్రం భారీగానే రాబ‌ట్ట‌డంతో రామ్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కూడా మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్‌నే ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి విజ‌య్ `జిల్లా` ఫేమ్ ఆర్‌.టి. నేస‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నార‌ట‌.

గ‌తంలో సూర్యా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా ఓ భానీ చిత్రాన్ని చేయాల్సింది కానీ అనివార్య కార‌ణాల వ‌ల‌న ఆ మూవీ ముహూర్తం ద‌శ‌లోనే ఆగిపోయింది. దీంతో స‌రికొత్త క‌థ‌ని హీరో రామ్ కి ఆర్‌.టి. నేస‌న్ వినిపించార‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో రామ్ వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు స్టార్ట‌య్యాయ‌ని, దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానున్న‌ట్టు తెలిసింది.