రామ్ రెడ్ రైట్స్ కు భారీ క్రేజ్


రామ్ రెడ్ రైట్స్ కు భారీ క్రేజ్
రామ్ రెడ్ రైట్స్ కు భారీ క్రేజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన కెరీర్ లోనే స్పెషల్ హిట్ ను ఇస్మార్ట్ శంకర్ ద్వారా అందుకున్నాడు. వరస ప్లాపులతో సతమతమవుతున్న టైమ్ లో ఇస్మార్ట్ శంకర్ రూపంలో అపురూపమైన హిట్ ను అందుకున్నాడు రామ్. వెంటనే అదే ఉత్సాహంతో తమిళ్ లో సూపర్ హిట్ అయిన తడం రీమేక్ ను మొదలుపెట్టాడు. చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసాడు. రెడ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన ఈ చిత్ర టీజర్ రీసెంట్ గా విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రెడ్ లో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఒకటి క్లాస్ రోల్ కాగా మరొకటి మాస్ రోల్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉంది. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేలా కనిపించట్లేదు. మరో డేట్ కు మార్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక రెడ్ సినిమాకు బిజినెస్ పరంగా భారీ రేట్లు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ అనలిస్టుల సమాచారం ప్రకారం రెడ్ సినిమాకు కేవలం ఆంధ్ర హక్కులే 12 కోట్ల వరకూ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇక సీడెడ్ కు 4.3 కోట్ల రేటు వచ్చింది. నైజాం ఏరియాకు ఇంకా బిజినెస్ క్లోజ్ అవ్వలేదు. ఇస్మార్ట్ శంకర్ నైజాంలో భారీ హిట్ కావడంతో ఇక్కడ క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. అందుకే నిర్మాతలు వెయిట్ గేమ్ ఆడుతున్నారు. భారీ రేటుకే ఈ చిత్రాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం 25 కోట్లకు పైన బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కిషోర్ తిరుమల రెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రామ్ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో ఇదివరకు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు వచ్చాయి. స్రవంతి రవి కిషోర్ నిర్మాత. మణిశర్మ సంగీత దర్శకుడు.