7 భాష‌ల్లో విడుద‌ల కానున్న ఎన‌ర్జిటిక్ స్టార్  `రెడ్‌`!


7 భాష‌ల్లో విడుద‌ల కానున్న ఎన‌ర్జిటిక్ స్టార్  `రెడ్‌`!
7 భాష‌ల్లో విడుద‌ల కానున్న ఎన‌ర్జిటిక్ స్టార్  `రెడ్‌`!

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ `ఇస్మార్ట్ శంక‌ర్` త‌రువాత న‌టిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `రెడ్‌`. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మాల్విక‌శ‌ర్మ‌, నివేదా పేతురాజ్, అమృతా అయ్య‌ర్  హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 14న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌ కానుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు 7 భాష‌ల్లో విడుదల కాబోతోంది.

త‌మిళ హిట్ చిత్రం `త‌డం` ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సంద‌ర్భంగా ‌చిత్ర స‌మ‌ర్ప‌కులు కృష్ణ పోతినేని మాట్లాడుతూ `రామ్ ద్విపాత్రాభిన‌యం చేసిన తొలి చిత్ర‌మిది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది` అని తెలిపారు.

నిర్మాత స్ర‌వంతి ర‌వికిషోర్ మాట్లాడుతూ `ఈ చిత్రాన్ని ఏడు భాష‌ల్లో అనువ‌దిస్తున్నాం. త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం, బెంగాలీ, భోజ్‌పురి, మ‌రాఠీ, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. తెలుగుతో పాటు క‌న్న‌డ వెర్ష‌న్ ఈ నెల 14నే విడుద‌ల కానుంది. మిగిలిన వెర్ష‌న్‌ల‌ను ఈ నెలాఖ‌రున రిలీజ్ చేసే ప్లాన్‌లో వున్నాం. త‌మిళ వెర్ష‌న్‌ని మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల చేస్తున్నాం. రామ్‌కి ఇత‌ర భాష‌ల్లో పెరిగిన మార్కెట్ రీత్యా ఇలా డ‌బ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. క‌చ్చితంగా ఈ సినిమా అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. అలాగే తెలుగు వెర్ష‌న్ గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ ద్వారా ఓవ‌ర్సీస్‌లో కూడా విడుద‌ల చేస్తున్నాం. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, సింగ‌పూర్‌, దుబాయ్‌ల‌లో రిలీజ్ చేస్తున్నాం` అన్నారు.