రామ్ రెడ్ కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుందా?


రామ్ రెడ్ కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుందా?
రామ్ రెడ్ కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుందా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ గతేడాది ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రామ్ రెడ్ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఈ సినిమా చిత్రీకరణ మార్చ్ లోనే పూర్తయింది. ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేద్దామని భావించారు. అయితే కరోనా కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది. రెడ్ చిత్రాన్ని ఓటిటి లో విడుదల చేయమని చాలానే ఆఫర్స్ వచ్చాయి. అయితే రామ్ మాత్రం వాటికి ససేమీరా అనేశాడు. కచ్చితంగా సినిమా థియేటర్స్ లోనే విడుదలవుతుందని రామ్ నొక్కి వక్కాణించాడు. తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన తడం చిత్రానికి రీమేక్ ఈ రెడ్.

రామ్ తో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలను తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేసాడు. రామ్ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో రామ్ డ్యూయల్ రోల్ పోషించనుండడం విశేషం. టీజర్ ఎప్పుడో విడుదల కాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక రెడ్ ఇప్పుడు సంక్రాంతి రేసులో నిలుస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వకీల్ సాబ్, కేజిఎఫ్ చాప్టర్ 2 చిత్రాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. అలాగే రంగ్ దే కూడా సంక్రాంతికే వస్తుందని అనుకుంటున్నారు. ఇప్పుడు రెడ్ వీటికి పోటీగా వెళ్లనుంది.