
విజయ్ దేవరకొండ తో నటించి విసిగిపోయాను మళ్ళీ విజయ్ దేవరకొండ తో నటించేది లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కన్నడ భామ రష్మిక మందన్న. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న లు రెండు చిత్రాల్లో నటించారు. గీత గోవిందం బ్లాక్ బస్టర్ కాగా డియర్ కామ్రేడ్ మాత్రం ప్లాప్ అయ్యింది.
ఈ ఇద్దరూ వరుసగా రెండు చిత్రాల్లో నటించడంతో ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని జోరుగా గుసగుసలు సాగుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ల మధ్య ప్రేమాయణం సాగుతోందని కథనాలు కూడా వస్తున్నాయి.
ఇక తాజాగా ఓ నెటిజన్ విజయ్ దేవరకొండ – మీరు చూడచక్కనైన జంట కాబట్టి ఇద్దరూ డేటింగ్ చేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. ఆ సలహాకు రష్మిక మందన్న కు చిర్రెత్తుకొచ్చింది. అందుకే ఇకపై రెండేళ్ల పాటు నేను విజయ్ దేవరకొండ కలిసి నటించేది లేదు అంటూ తేల్చిచెప్పింది అంతేనా ! విజయ్ దేవరకొండతో నేను విసిగిపోయాను అంటూ ట్వీట్ చేసింది రష్మిక మందన్న.