“రాముడు భీముడు to వెంకీ మామ” సురేష్ ప్రొడక్షన్స్ @50+


Ramudu – bheemudu to venky mama suresh productions success journey
Ramudu – bheemudu to venky mama suresh productions success journey

ఇప్పుడంటే, కొన్ని సార్లు డైరెక్టర్, హీరో మరియు కొంతమంది పెత్తనాలు ఎక్కువైపోయి నిర్మాతలు కేవలం లెక్కలు, బిజినెస్ వ్యవహారాలకు పరిమితం అవుతున్నారు కానీ, వెనకటిరోజుల్లో అలాకాదు, ఒక సినిమాకు సంబంధించిన 24 విభాగాలలో తమదైన సంతకం ఉండే విధంగా సినిమాలు చేసేవారు మొదటితరం నిర్మాతలు. సినిమాలకు పనిచేసే నటీనటులను, సాంకేతిక నిపుణులను సమర్ధవంతంగా సమన్వయము చేసే వారు. అలాంటి గొప్ప సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. ఆ సంస్థ అధినేత డా. డి. రామానాయుడు గారు.

సుమారు 56 ఏళ్ళ సుదీర్ఘ చరిత్రలో ఎన్నో సినిమాలు ఎన్నో అనుభవాలు. సినిమా ఫ్లాప్ అయిన ప్రతిసారి పోగట్టుకున్న చోటే రాబట్టుకుంటూ, వాటికి మించిన హిట్ లు తీసింది ఈ సంస్థ. 50 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో రామానాయుడు మొత్తం 115 స్ట్రెయిట్‌చిత్రాలు, 17 దాకా డబ్బింగు చిత్రాలు నిర్మించారు. సొంత పంపిణీ సంస్థని కూడా ఏర్పాటుచేసుకున్నారు. భవనం వెంకట్రామరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రామానాయుడు స్టూడియో ఏర్పాటు అయ్యింది . ఆతర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు తరువాత తెలుగ్గు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కి క్రమక్రమంగా తరలివచ్చింది.

ఇక సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలను రామానాయుడు గారి పెద్ద కొడుకు సురేష్ బాబు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆయన మరొక కొడుకు, వెంకటేష్ మనందరికీ నిన్నమొన్నటివరకూ, విక్టరీ వెంకటేష్ గా గుర్తుండి, ఇప్పుడు వెంకీ మామ గా యువతను అలరిస్తున్నారు. ప్రస్తుతం మూడోతరం వారసుడు రానా దగ్గుబాటి తమ సంస్థను అన్ని రకాలుగా entertainment రంగంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సంస్థ ఇలాగే మరెన్నో మంచి సినిమాలు చెయ్యాలని, అనేక మంది ఆర్టిస్ట్ లనూ, టెక్నీషియన్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చెయ్యాలని కోరుకుంటూ, ప్రస్తుతం రిలీజ్ అవుతున్న మామ & అల్లుళ్ళ మ్యాజికల్ మూవీ వెంకీ మామ ఇండస్టీ హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.