మ‌ల‌యాళ రీమేక్‌లో ఆ ఇద్ద‌రు నిజ‌మేనా?మ‌ల‌యాళ రీమేక్‌లో ఆ ఇద్ద‌రు నిజ‌మేనా?
మ‌ల‌యాళ రీమేక్‌లో ఆ ఇద్ద‌రు నిజ‌మేనా?

మ‌ల‌యాళంలో సూపర్ హిట్‌లుగా నిలిచిన చిత్రాల్ని తెలుగులో రీమేక్ చేయాల‌ని స్టార్ హీరోలు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇప్ప‌టికే హీరో రామ్‌చ‌ర‌ణ్ మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన `లూసీఫ‌ర్` చిత్రాన్ని తెలుగులో రిలీమేక్ చేయాల‌ని ఆ మూవీ రీమేక్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్నారు. ఇదిలా వుంటే తాజాగా మ‌రో మ‌ల‌యాళ చిత్ర రీమేక్ హ‌క్కుల్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకున్నారు.

పృథ్విరాజ్ సుకుమార‌న్‌, బీజు మీన‌న్ క‌లిసి న‌టించిన చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌నుమ్‌`. ఇటీవ‌ల ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌లైన ఈ చిత్రం మ‌ల‌యాళంలో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూన్య దేవ‌ర‌నాగ‌వంశీ రీమేక్ చేయ‌బోతున్నారు. ఇందులో బాల‌కృష్ఱ‌, రానా న‌టించే అవ‌కాశం వుందని ప్ర‌చ‌రం జ‌రుగుతోంది. మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంగా దీన్ని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇటీవ‌లే చిత్ర బృందం హీరో రానాతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, రానా కూడా ఈ రీమేక్‌లో న‌టించ‌డానికి సుముఖ‌త‌ను వ్య‌క్తం చేశార‌ని తెలిసింది. అయితే బాల‌కృష్ణ‌ని మాత్రం ఇంత వ‌ర‌కు సంప్ర‌దించ‌లేద‌ట‌. క‌థ‌, పాత్ర న‌చ్చితే బాల‌య్య కాద‌న‌ర‌ని ఇండ‌స్ట్రీలో టాక్ వుంది. గ‌తంలో మంచు మ‌నోజ్ న‌టించిన `ఊ కొడ‌తారా ఉలిక్కి ప‌డ‌తారా` చిత్రంలో బాల‌కృష్ణ ఘోస్ట్ పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే.