బీచ్‌లో రానా – మిహీకా స‌న్ బాత్‌!


బీచ్‌లో రానా - మిహీకా స‌న్ బాత్‌!
బీచ్‌లో రానా – మిహీకా స‌న్ బాత్‌!

రానా ద‌గ్గుబాటి మేలో త‌న ప్రేమ పెళ్లి గురించి సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా ప్ర‌క‌టించి షాకిచ్చిన విష‌యం తెలిసిందే. త‌న మిహీకాకు ప్ర‌పోజ్ చేశాన‌ని, త‌ను ఫైన‌ల్‌గా య‌స్ అంద‌ని మిహీకాతో క‌లిసి వున్న ఓ ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేయ‌డం తెలిసిందే. ఆ త‌రువాత వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీక‌రించ‌డంతో ఆగ‌స్టు 8న రానా – మిహీకాల వివాహం జ‌రిగింది.

అత్యంత స‌న్నిహితులు 30 మంది మాత్ర‌మే పాల్గొన్నారు. కోవిడ్ కార‌ణంగా అత్యంత త‌క్కువ మంది బంధువుల మ‌ధ్య వివాహం జ‌రిగింది. లాక్‌డౌన్ స‌డ‌లించ‌డంతో ప్ర‌స్తుతం ఈ కొత్త జంట హ‌నీమూన్ టూర్ కు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఇన్‌స్టాలో మిహీకా బ‌జాజ్ ఓ ఫొటోని షేర్ చేసింది. రానా, మిహీకా బీచ్ ఒడ్డున స‌న్ బాత్ చేస్తున్న ఫొటో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

రానా రెడ్ క‌ల‌ర్ స్లీవ్‌లెస్ క్యాజువ‌ల్ టీ ష‌ర్ట్ ధ‌రించి క‌నిపిస్తుండ‌గా మీహీకా ఫ్ల‌వ‌ర్ ప్రింట్ టాప్ .. జీన్స్ ధ‌రించి చిరున‌వ్వులు చిందిస్తోంది. మ్యారేజ్ త‌రువాత ప‌రిస్థితుల్ని బ‌ట్టి న్యూజిల్యాండ్ హ‌నీమూన్‌కి వెళ్లాల‌ని వుంద‌ని రానా ఆ మ‌ధ్య నేహా షోలో వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

 

View this post on Instagram

 

Just because 🥰🥰 @ranadaggubati

A post shared by miheeka (@miheeka) on