రానా, మిహీకాల పెళ్లికి ప‌క్కా ప్లాన్ రెడీ!


రానా, మిహీకాల పెళ్లికి ప‌క్కా ప్లాన్ రెడీ!
రానా, మిహీకాల పెళ్లికి ప‌క్కా ప్లాన్ రెడీ!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో ద‌గ్గుబాటి రానా ఒక‌రు. గ‌త కొంత కాలంగా పెళ్లి  ప్రస్తావన వ‌స్తే దాట‌వేస్తూ వ‌చ్చిన రానా మే 12న తన‌‌కు ఈ అమ్మాయి ఓకే చెప్పిందంటూ మిహీకా బ‌జాజ్‌తో వున్న ఫొటోని షేర్ చేసి వినూత్నంగా త‌న ప్రేమ‌, పెళ్లి వార్ల‌ని సోష‌ల్ మ‌డియా ఇన్‌స్టా వేదిక‌గా వెల్ల‌డించి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు ఆడియ‌న్స్‌కీ షాకిచ్చిన విష‌యం తెలిసిందే.

ఇరు కుటుంబాలు వీరి ప్రేమ‌ని అంగీక‌రించ‌డం‌తో ఇటీవ‌లే రోకా వేడుక‌ని నిర్వ‌హించారు. ఆగ‌స్టు 8న వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. దీనిపై సురేష్‌బాబు మాట్లాడిన‌ట్టు తెలిసింది. ఆగ‌స్టు 8న వివాహం చేయ‌బోతున్నామ‌ని, లాక్‌డౌన్ కార‌ణంగా పెళ్లి ప‌నులకు స‌మ‌యం దొరికింద‌ని, ప్ర‌స్తుతం పెళ్లి ఏర్పాట్ల‌లో బిజీగా వున్నామ‌ని రానా ఫాద‌ర్ సురేష్‌బాబు వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది. అతి కొద్దిమంది మాత్ర‌మే ఈ వివాహానికి హాజ‌రు కానున్నార‌ట‌. క‌రోనా ప్ర‌భావం అప్ప‌టికి త‌గ్గితే పెళ్లి వేడుక‌లో మార్పులు వుంటాయ‌ని, ముందు అనుకున్న‌దానికి మించి మ‌రింత గ్రాండియ‌ర్‌గా వివాహం జ‌రిపేందుకు ప‌క్కా ప్లాన్‌ని రెడీ చేశారు.

క‌రోనా విజృంభ‌ణ ఇలాగే వుంటే ప్లాన్ ఏ, క‌రోనా ఉధృతి త‌గ్గితే ప్లాన్ బీని అమ‌లు చేయాల‌ని ద‌గ్గుబాటి ఫ్యామిలీ ప్లాన్ చేస్తోంద‌ట‌. ఇదిలా వుంటే మిహీకా వెడ్డింగ్ ప్లాన‌ర్ కావ‌డంతో పెళ్లికి త‌నదే ప్లాన్ అంతా అని తెలుస్తోంది. ప్ర‌త్యేక థీమ్‌తో ఈ పెళ్లి వేడుక‌ని నిర్వ‌హించ‌బోతున్నార‌ట‌. వివాహానికి రెండు రోజుల ముందు నుంచే అంటే 6, 7 తేదీల్లో ప్ర‌త్యేక వేడుక‌లు జ‌ర‌ప‌నున్నారని తెలిసింది‌.