రానా కోసం మిహీకా ఉప‌వాసం‌!


రానా కోసం మిహీకా ఉప‌వాసం‌!
రానా కోసం మిహీకా ఉప‌వాసం‌!

టాలీవుడ్ క్రేజీ హీరో రానా ద‌గ్గుబాటి అత్తారింట్లో సంద‌డి చేస్తున్నారు. ఇటీవ‌ల మిహీకా బ‌జాజ్‌ని వివాహం చేసుకున్న రానా ఈ విజ‌య ద‌శ‌మి సంద‌ర్భంగా అత్తారింట్లో అడుగు పెట్టారు. ఈ ఫెస్టివెల్‌ని అత్తారింట్లో భార్య‌తో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని మిహీకా బ‌జాజ్ మ‌ద‌ర్ బంటీ బ‌జాజ్ సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో పంచుకున్నారు.

ఈ సంబ‌రం మ‌ర‌వ‌క ముందే రానా వైఫ్ మిహీకా బ‌జాజ్ భ‌ర్త కోసం ఉప‌వాసం వుంద‌ట‌. విజ‌య ద‌శ‌మిని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్న ఈ జంట తాజాగా కర్వాచౌత్‌ని జ‌రుపుకుంది. ఉత్త‌రాదికి మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఈ ఫెస్టివెల్‌ని రానా అత్తారింట జ‌రుపుకున్నారు. భ‌ర్త‌ల కోసం భార్య‌లు  ఉప‌వాసం వుండ‌టం.. సాయంత్రం జ‌ల్లెడ అడ్డు పెట్టుకుని చంద్రుడిని చూస్తూ భ‌ర్త ముఖాన్ని తిల‌కించ‌డం ఈ ఫెస్టివెల్ ఆన‌వాయితీ.

మిహీకా బ‌జాజ్ ఫ్యామిలీ ఉత్త‌రాది నుంచి వ‌చ్చారు కాబ‌ట్టి క‌ర్వాచౌత్‌ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి రానా భార్య మిహీకాతో క‌లిసి అత్తారింటికి వెళ్లారు. అక్క‌డ మిహీకా రానా కోసం ఉప‌వాసం వుంద‌ట‌. దీనికి సంబంధించిన ఫొటోల్ని సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నారు.