అత్తారింట్లో భ‌ల్లాలుడి హంగామా!

అత్తారింట్లో భ‌ల్లాలుడి హంగామా!
అత్తారింట్లో భ‌ల్లాలుడి హంగామా!

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి తన మొదటి దసరాను త‌న అత్తారింట్లో ఫుల్ జోష్‌తో జరుపుకున్నాడు. ద‌గ్గుబాటి రానా ఈ ఏడాది మేలో త‌ను ప్రేమ‌లో వున్నాని, ఓ అమ్మాయికి ప్ర‌పోజ్ చేశాన‌ని, ఆమె కూడా త‌న ప్రేమ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందంటూ మిహీకా బ‌జాజ్‌తో వున్న ఫొటోని సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా పంచుకున్న విష‌యం తెలిసిందే.

వీరి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీక‌రించ‌డంతో లాక్‌డౌన్ స‌మ‌యంలోనే ఆగ‌స్టు 8న రానా , మిహీకా బ‌జాజ్‌ల వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అయితే క‌రోనా కార‌ణంగా నిబంధ‌న‌లు వుండ‌టంతో వీరి పెళ్లికి అత్యంత స‌న్నిహితులైన 30 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఆ త‌రువాత రానా, మిహీకా జోడీ హ‌నీమూన్ వెళ్లిన విష‌యం తెలిసిందే.

పెళ్లైన త‌రువాత తొలి ఫెస్టివ‌ల్ గా విజ‌య‌ద‌శ‌మి రావ‌డంతో రానా ఈ ఫెస్టివెల్‌ని అత్తారింట్లో జ‌రుపుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోల‌ని రానా అత్తాగారైన బంటీ బ‌జాజ్ నెటిజ‌న్‌ల‌తో పంచుకుంది.  ట్రెడిష‌న‌ల్ సారీలో మిహికా క‌నిపిస్తే, రానా మాత్రం క్యాజువ‌ల్ కుర్తాలో డెనిమ్ పాంట్‌లో క‌నిపించాడు. రానా న‌టిస్తున్న `అర‌ణ్య‌` చిత్రం నాలుగు భాష‌ల్లో ఈ సంక్రాంతికి విడువద‌ల కాబోతోంది.