సమంతని పెళ్ళి చేసుకొని బాధపడుతున్నావా : రానా


Rana comments on samantha

సమంత ని పెళ్ళి చేసుకొని బాధపడుతున్నావా ? నిన్నేమైనా ఇబ్బంది పెడుతుందా ? అంటూ అక్కినేని నాగచైతన్య ని ప్రశ్నిం చాడు రానా దగ్గుబాటి .దానికి నాగచైతన్య సమాధానం ఏమిచ్చాడో తెలుసా ……. ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడో తెలుసా ……. ఇలాంటి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకురా బాబు …… అంటూ అన్యమనస్కంగానే నవ్వాడు చైతన్య . సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే తాజాగా సవ్యసాచి ప్రమోషన్ లో భాగంగా చైతూ రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నెంబర్ వన్ యారీరే కార్యక్రమమలో పాల్గొన్నాడు ఆ సందర్భంగా రానా చైతూ ని ఇరుకున పెట్టడానికి సమంతని పెళ్ళి చేసుకున్నందుకు బాధపడుతున్నావా ? అంటూ ప్రశ్నించాడు . దానికి కాస్త ఇబ్బంది పడుతూనే సమాధానం ఇచ్చాడు చైతన్య .

ఈ కార్యక్రమం వచ్చే ఆదివారం ప్రసారం కానుంది . రానా – నాగచైతన్య ఇద్దరు కూడా బావా – బావామరుదులు అన్న విషయం తెలిసిందే . నాగచైతన్య రానా కు మేనత్త కొడుకు . దాంతో చిన్నప్పటి నుండి రానా – నాగచైతన్య కలిసే పెరిగారు . ఆ చనువు తోనే కవ్వించడానికి ఈ ప్రశ్న వేసాడు . ఇక చైతూ నటించిన సవ్యసాచి నవంబర్ 2 న విడుదల అవుతోంది . చైతూ కోరుకుంటున్న యాక్షన్ ఇమేజ్ ని సవ్యసాచి అందిస్తుందో లేదో చూడాలి .

English Title: Rana comments on samantha