స్టార్ డైరెక్ట‌ర్‌కు రానా కండీష‌న్స్‌!


స్టార్ డైరెక్ట‌ర్‌కు రానా కండీష‌న్స్‌!
స్టార్ డైరెక్ట‌ర్‌కు రానా కండీష‌న్స్‌!

`బాహుబ‌లి` సిరీస్‌లు వ‌రుసగా స‌క్సెస్ కావ‌డంతో హీరో రానా పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. దీంతో రానా సినిమా వ‌స్తోందంటే భారీ అంచ‌నాలు నెల‌కొంటున్నాయి. అందుకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో తన సినిమాలు వుండాల‌ని రానా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం రానా `విరాట ప‌ర్వం` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

`నీదీ నాదీ ఒకే క‌థ` ఫేమ్ వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఉత్త‌ర తెలంగాణ‌లో 90వ ద‌శ‌కంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాయిప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. కాగా ఈ సినిమాతో పాటు గుణ‌శేఖ‌ర్ రూపొందించ‌నున్న మైథ‌లాజిక‌ల్ మూవీ `హిర‌ణ్య‌క‌శ్య‌ప‌` చిత్రంలో న‌టించ‌బోతున్నారు.

గ‌త కొంత కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అమెరికాలో జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం రానా డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌కు ఓ కండీష‌న్ పెట్టార‌ట‌. ఎంత టైమ్ తీసుకున్నా ఫ‌ర‌వాలేదు కానీ ప్రాప‌ర్‌గా గ్రాఫిక్స్ వుండాల‌ని, క్వాలిటీ ఏమాత్రం త‌గ్గిన‌ట్టు అనిపించినా సినిమాని మ‌ధ్య‌లోనే వ‌దిలేస్తాన‌ని కండిష‌న్ పెట్టార‌ట‌. ఆ కండీష‌న్ ప్ర‌కార‌మే పేరున్న స్టూడియోల్లో వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని, అది పూర్త‌వ్వ‌గానే సినిమాని ఈ ఏడాదే ప‌ట్టాలెక్కిస్తార‌ట‌.