క‌రోనా ఎఫెక్ట్‌: రానా `అర‌ణ్య‌` రిలీజ్ వాయిదా!


క‌రోనా ఎఫెక్ట్‌: రానా  `అర‌ణ్య‌` రిలీజ్ వాయిదా!
క‌రోనా ఎఫెక్ట్‌: రానా `అర‌ణ్య‌` రిలీజ్ వాయిదా!

క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండవం చేస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా దీని ధాటికి ల‌క్ష‌ల్లో కేసులు న‌మోద‌వుతున్నాయి. జ‌నాలు క‌రోనా దెబ్బ‌కు బ‌య‌టికి రావాలంటే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమా థిమేట‌ర్లు బంధ్ చేయాల‌ని, సినిమా షూటింగ్‌ల‌ని అర్థాంత‌రంగా నిలిపివేయాల‌ని టాలీవుడ్ చిత్న ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో చిత్రీక‌ర‌ణ‌లో వున్న చాలా చిత్రాల షూటింగ్‌ల‌ని బంద్ చేశారు.

దీని కార‌ణంగా కొన్ని చిత్రాల విడుద‌ల వాయిదా వేయాల్సి వ‌చ్చింది. నాని, సుధీర్‌బాబు `వి`తో పాటు ప‌లు చిత్రాలు వాయిదా ప‌డ్డాయి. తాజాగా ఇదే కోవ‌లో రానా సినిమా విడుద‌ల‌ను కూడా వాయిదా వేస్తున్న‌ట్టు చిత్ర బృందం సోమ‌వారం ప్ర‌క‌టించింది. రానా హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `హాథీ మేరే సాథీ`. ప్ర‌భుసాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో `అర‌ణ్య` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఈ చిత్ర రిలీజ్‌ని వాయిదా వేస్తున్న‌ట్టు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఓ ప్ర‌క‌ట‌న‌ని విడుద‌ల చేశారు. `ప్రేక్ష‌కుల అభిరుచికి ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎల్ల‌ప్పుడూ అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇదివ‌ర‌కెప్పుడూ చెప్ప‌ని విల‌క్ష‌ణ క‌థ‌ల‌తో సినిమాలు నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూట్ చేయ‌డానికి ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం వుండాల‌ని మ‌మ్మ‌ల్ని ప్రేక్ష‌కులు ఎప్పుడూ మోటివేట్ చేస్తూనే వున్నారు. క‌రోనా వైర‌స్ (కోవిడ్ 19) పై వ‌స్తున్న వార్త‌ల్ని దృష్టిలో వుంచుకుని అర‌ణ‌క‌చ‌, హాథీమేరే సాథీ, కాండ‌న్ చిత్రాల విడుద‌ల తేదీని మార్చాల‌ని నిర్ణ‌యించుకున్నాం. త్వ‌ర‌లోనే కొత్త రిలీజ్ డేట్‌ని వెల్ల‌డిస్తాం అన్నారు. ముందు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితులు దృష్ట్యా రిలీజ్ డేట్‌ని వాయిదా వేశారు.