రానా ఫ‌స్ట్ లుక్‌: న‌క్స‌లైట్ నాయ‌కుడు ర‌వ‌న్న!


Rana daggubati as naxalite ravanna in virataparwam
Rana daggubati as naxalite ravanna in virataparwam

రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్న తాజా చిత్రం `విరాట‌ప‌ర్వం`. ఈ మూవీ ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి హాట్ టాపిక్‌గా మారింది. 1990వ ద‌శ‌కంలో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అభ్యుద‌ర భావాలున్న యువ ద‌ర్శ‌కుడు, `నీది నాది ఒకే క‌థ` ఫేమ్ వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డి. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

నందితా దాస్, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నేడు హీరో రానా పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా రానా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. సినిమా ప్రారంభానికి ముందు రానా ప్రీలుక్‌ని రిలీజ్ చేశారు. ముఖానికి ఎర్ర‌ని స్కార్ఫ్‌తో రానా క‌నిపించిన తీరు సినిమా ఏ రేంజ్‌లో వుండ‌బోతోంద‌న్న‌ది క్లారిటీ ఇచ్చింది. తాజాగా రానా ఫ‌స్ట్‌లుక్‌తో పాటు ఆయ‌న పాత్ర పేరుని కూడా రివీల్ చేశారు. ఇందులో రానా న‌క్స‌లైట్ నాయ‌కుడు ర‌వ‌న్న‌గా క‌నిపించ‌బోతున్నారు.

ఏకేలు, ఎర్ర జెండాలు ప‌ట్టుకుని త‌న వ‌ర్గం త‌న వెంట‌రాగా పొంగ‌మంచుని చీల్చుకుంటూ ఏకే 47తో అలీవ్ గ్రీన్ డ్రెస్‌లో రానా క‌నిపిస్తున్న తీరు టెర్రిఫిక్‌గా వుంది. ఉత్త‌ర తెలంగాణ‌లో 90వ ద‌శ‌కంలో జ‌రిగిన ఉద్య‌మ నేప‌థ్యానికి ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌ని జోడించి మ‌న‌సుకుకి హ‌త్తుకునే క‌థ, క‌థ‌నాల‌తో ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి ఇందులో ఫోక్ సింగ‌ర్‌గా జ‌నాన్ని ఉత్తేజ‌ప‌రిచే యువ‌తిగా క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ ఉద‌యం 11:07 నిమిషాల‌కు ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఉత్త‌ర తెలంగాణ నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.