రానా క్లాప్‌తో విశ్వ‌క్‌సేనుడి `పాగ‌ల్‌` షురూ!


రానా క్లాప్‌తో విశ్వ‌క్‌సేనుడి `పాగ‌ల్‌` షురూ!
రానా క్లాప్‌తో విశ్వ‌క్‌సేనుడి `పాగ‌ల్‌` షురూ!

విభిన్న‌మైన చిత్రాల‌తో ఆక‌ట్టుకుంటున్నారు విశ్వ‌క్‌సేన్‌. వెళ్లిపోమాకే, ఈ న‌గ‌రానికి ఏమైంది. ఫ‌ల‌క్‌నుమాదాస్‌, హిట్ వంటి చిత్రాల‌తో హీరోగా కొత్త త‌ర‌హా చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `పాగ‌ల్`. ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ఉద‌యం రామానాయడు స్టూడియోస్‌లో ప్రారంభ‌మైంది. ఈ చిత్రం ద్వారా న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

హీరో విశ్వ‌క్‌సేన్‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి హీరో రానా క్లాప్‌నిచ్చారు. నిర్మాత దిల్ రాజు ద‌ర్శ‌కుడికి స్క్రిప్ట్‌ని అంద‌జేశారు. విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న ఐద‌వ చిత్ర‌మిది. కొత్త త‌ర‌హా రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా కూపొందుతున్న ఈ చిత్రానికి మ‌ణికంద‌న్ ఛాయ‌గ్ర‌హ‌ణం, ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్నారు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ స‌మ‌కూరుస్తున్నారు.

ఈ నెల‌ 21 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ అనుకున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ని బట్టి షూటింగ్ షెడ్యూల్ వుంటుద‌ని తెలుస్తోంది. హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఎవ‌రు వుంటార‌నే దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి వుంది. వ‌న్స్ క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల షూటింగ్‌ల‌ని తాత్కాలికంగా ఆపేశారు. 21 నుంచి స్టార్ట్ చేయెచ్చ‌ని ప్ర‌క‌ట‌న వ‌స్తే కానీ మిగ‌తా విష‌యాల‌ని ప్ర‌క‌టించే అవ‌కాశం వుంది.