పది సంవత్సరాల రానా.. ప్రౌడ్ దగ్గుబాటి ఫ్యామిలీ


 

Rana Daggubati completes 10 years special video
Rana Daggubati completes 10 years special video

రానా దగ్గుబాటి లీడర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అందరినీ ఇంప్రెస్ చేసాడు. అయితే తన కెరీర్ హీరోగా అనుకున్నంత సాఫీగా ముందుకు సాగలేదు. మొదట్లో హీరోగా రానా చేసిన సినిమాలు అన్నీ ఫట్ మన్నాయి. దీంతో రానా కెరీర్ ఎక్కువగా ముందుకు సాగదని అందరూ అనుకున్నారు. అయితే రానా తన కెరీర్ లో తీసుకున్న డెసిషన్ చాలా కీలకంగా మారింది. తన కెరీర్ స్వరూపాన్నే మార్చేసింది. కేవలం హీరోగానే పరిమితమవ్వకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా రానా రాణించాడు. బాహుబలి, బేబీ వంటి సినిమాలతో భాషతో పనిలేకుండా పాత్ర ఏంటన్నది లెక్క లేకుండా సినిమాలు చేసాడు రానా. అది తనకు బాగానే కలిసొచ్చింది. అన్ని భాషల్లో కూడా రానాకు పాపులారిటీ తెచ్చి పెట్టింది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా రాణిస్తూనే నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో హీరోగానూ మెప్పిస్తున్నాడు. విభిన్నమైన సినిమా అంటే కచ్చితంగా రానా పేరే గుర్తొస్తోంది జనాలకు. ప్యాన్ ఇండియాలో మూవీ అంటే కచ్చితంగా రానా పేరు ప్రస్తావనకు వస్తోంది. అన్ని భాషల్లో రానాకు ఫేమ్ ఉండడం కలిసొస్తోంది. ప్రస్తుతం హాథీ మేరె సాథీతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాడు రానా. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకు షెడ్యూల్ అయింది.

ఇక ఇప్పుడు రానా సినీ కెరీర్ లో పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దగ్గుబాటి ఫ్యామిలీ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. అందులో సురేష్ బాబు, వెంకటేష్ లతో పాటు రానాతో పనిచేసిన మరికొందరు సాంకేతిక నిపుణులు కూడా తన గురించి ఆసక్తికర విషయాలను చెప్పారు. రానాను హీరో అనాలో, విలన్ అనాలో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనాలో తెలియడం లేదని వెంకటేష్ చెప్పడం విశేషం. ఈ వీడియోను ఆర్డీ 10 ఎపిసోడ్ 1 గా రూపొందించారు. అంటే దీనిలో మరిన్ని ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే రానా దగ్గుబాటి గురించి దగ్గుబాటి ఫ్యామిలీ చాలా పాజిటివ్ గా, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు.