మరికొన్ని నెలలు సినిమాలకు దూరంగా రానా!


మరికొన్ని నెలలు సినిమాలకు దూరంగా రానా!
మరికొన్ని నెలలు సినిమాలకు దూరంగా రానా!

వరసపెట్టి సినిమాలు చేసుకునే రానా దగ్గుబాటి సడెన్ గా యూఎస్ పయనమయ్యాడు. మొదట సినిమా సంబంధిత వ్యవహారంపై అక్కడికి వెళ్లినట్లు రానా చెబుతూ వచ్చినా మీడియా మాత్రం రానా ఏదో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు కథనాలు ప్రచురించింది. యూఎస్ లో అంత కాలం ఉండిపోవడంతో అందరూ దాన్ని నిజమని నమ్మారు. పైగా రానా బాగా బక్కచిక్కిపోయి కనిపించడం ఆ వాదనకు బలాన్ని చేకూర్చింది.

మొత్తానికి తెలిసిందేమంటే రానా ఏదో కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడట. మీడియాలో ఈ రకమైన వార్తలు ఎక్కువగా రావడంతో రానా తాను ఇండియా వస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. నిజంగా వచ్చాడు కూడా. కానీ హైదరాబాద్ రాలేదు. రానా డైరెక్ట్ గా ముంబై వెళ్ళాడు. అక్కడ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

రానా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని సమాచారం. ఇలా అయితే రానా ఒప్పుకున్న సినిమాల భవితవ్యం ఏమిటో. ముఖ్యంగా రానా సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న విరాటపర్వం షూటింగ్ 50 శాతం పూర్తయింది. రానా వస్తే కానీ బ్యాలన్స్ పార్టు షూటింగ్ చేయలేరు. సాయి పల్లవి మాత్రం తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుని శేఖర్ కమ్ముల సినిమాలో నటిస్తోంది.

 

View this post on Instagram

 

Alright!! Back online!! And will be back in India in 72hours 😉

A post shared by Rana Daggubati (@ranadaggubati) on