అంగరంగ వైభవంగా రానా-మిహీకల వివాహంrana daggubati miheeka bajaj ties the knot
rana daggubati miheeka bajaj ties the knot

దగ్గుబాటి వారి ఇంట పెళ్లి సందడి పూర్తయింది. రానా దగ్గుబాటి తన స్నేహితురాలు మిహీక బజాజ్ ను నిన్న రాత్రి వివాహం చేసుకున్నాడు. రామానాయుడు స్టూడియోస్ లో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రానా దగ్గుబాటి షేర్వాణీ ధరించగా, మిహీక గోల్డ్, క్రీం కలర్ మిక్స్ లెహెంగాను ధరించింది.

ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ సభ్యులు, చాలా దగ్గరి వారు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు కాకుండా చాలా తక్కువ మందినే ఈ వేడుకకు ఆహ్వానించారు. పెళ్లి వేడుకకు వచ్చిన వారిలో రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ ల పేర్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. మిగిలిన గెస్ట్ ల కోసం ఇంటి వద్ద నుండే పెళ్లిని వీక్షించడానికి విర్చువల్ రియాలిటీ సెటప్ చేసారు. కొంత మంది సెలబ్రిటీలు ఈ విధంగా పెళ్లిని వీక్షిస్తున్నట్లు ట్వీట్స్ చేసారు. ఇక పెళ్లిలో వెంకటేష్, సమంత, నాగ చైతన్యల హంగామా మాములుగా లేనట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం రూపొందించిన గైడ్ లైన్స్ ను అనుసరించే పూర్తి సురక్షిత వాతావరణంలో ఈ వేడుక జరిగింది. ఇద్దరూ ఒక్కటైనా శుభసందర్భంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.