చక్కగా కామిక్స్ చదువుకోండి – రానా కరోనా ఆఫర్

చక్కగా కామిక్స్ చదువుకోండి – రానా కరోనా ఆఫర్
చక్కగా కామిక్స్ చదువుకోండి – రానా కరోనా ఆఫర్

కరోనా వైరస్ దేశం అంతటా విస్తరిస్తున్న నేపధ్యంలో రాబోయే కొద్ది రోజులు మనకు ఎంతో కీలంకంగా మారనున్నాయి. ఒక 2 – 3 వారాలు మనకు మనమే.. సామాజికంగా జరిగే అన్ని రకాల కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, సంయమనంతో వ్యవహరించవలసి ఉన్నది. సామాజిక భాద్యతతో ఉండే మన నటీనటులు ప్రస్తుత విపత్తును ఎదుర్కొనే విధంగా మనకు మానసిక ధైర్యం అందిస్తున్నారు.

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కూడా కరోనా వైరస్ సందర్భంగా ఇంట్లో ఉండవలసిన పరిస్థితుల్లో ప్రజలకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు. “టింకిల్”, “అమరచిత్రకథ” యాప్ లను ఒక నెలపాటు ఉచితంగా అందిస్తున్నామనీ, ప్రజలు.. ముఖ్యంగా పిల్లలు బయట ఎక్కువగా తిరగకుండా.. ఇంటిపట్టున ఉండి ఈ అప్లికేషన్ ల ద్వారా వినోదం, విజ్ఞానం పొందండి.! అని అంటున్నారు రానా దగ్గుబాటి.

ఇక ఇప్పటికే అనేకమంది సినిమా తారలు తమకు తోచిన విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ప్రజలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రానా లాంటి హీరోలు ప్రస్తుత పరిస్థితుల్లో, ఇంకా యాక్టివ్ గా ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Credit: Twitter