కోలుకుంటున్న రానా దగ్గుబాటి!


Rana Daggubati
Rana Daggubati

లీడర్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన రానా ఆతర్వాత నటించిన నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణంవందే జగద్గురుమ్ చిత్రాల్లో నటించారు.. ఇక ఆక్కడినుండి రానా కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో భల్లాలదేవగా తన నట విశ్వరూపాన్ని చూపించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక అక్కడనుండి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో బిజీ అయిపోయారు రానా. గాజి వంటి డిఫరెంట్ చిత్రం లో నటించి హిట్ కొట్టారు.. అలాగే తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి తో మరో హిట్ ని సొంతం చేసుకున్నారు రానా.

గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య కాశ్యప్, వంటి భారీ చిత్రంతో పాటు విరాట పర్వం, హాథీ మేరె సాథీ, హౌస్ ఫుల్-4 చిత్రాల్లో నటిస్తున్నారు ఆయన..ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాల్లో అతి తొందరలోనే జాయిన్ కానున్నారు రానా.. ఈ మధ్య  కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ జరగడంతో రానా ప్రస్తుతం లాస్ ఏంజెస్లో రెస్ట్ తీసుకుంటున్నారు.. లేటెస్ట్ గా రానా తాను హ్యాపీగా కోలుకున్నాను త్వరలోనే ఇండియా వస్తాను అని తన పిక్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.. సెప్టెంబర్ లో తిరిగి ఇండియాకి రానున్నాడు యంగ్ అండ్ డైనమిక్ హీరో రానా దగ్గుబాటి..!!