రానా కూడా సంక్రాంతి బ‌రికి రెడీ!


రానా కూడా సంక్రాంతి బ‌రికి రెడీ!
రానా కూడా సంక్రాంతి బ‌రికి రెడీ!

`బాహుబ‌లి` త‌రువాత ప్ర‌భాస్‌తో పాటు రానా స్థాయి పెరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అందుకే ఆ త‌రువాత చేస్తున్న సినిమాల‌న్నీ ఆ స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌కుండా చూసుకుంటున్నాడు. రానా న‌టిస్తున్న తాజా చిత్రం `అర‌ణ్య‌`. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ ష‌భాల్లో ఈ చిత్రాన్నిరిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

హిందీలో ఈ చిత్రాన్ని `హాథీ మేరే సాతీ` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు ప్ర‌భుసాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి చిత్రాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌మిళంలో `కాండ‌న్‌` పేరుతో ‌రిలీజ్ చేయ‌బోతున్నారు. అర‌ణ్యం నేప‌థ్యంలో ఏనుగు ప్ర‌ధానంగా సాగే ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయ‌బోతున్నారు.

బుధ‌వారం ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం మోష‌న్ పోస్ట‌ర్‌తో పాటు ఈ మూవీ రిలీజ్‌ని కూడా ప్ర‌క‌టించింది. విష్ణు విశాల్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నాడు. `ప్రాణాంత‌క మ‌హ‌మ్మారిపై పోరాడుతున్న మ‌నం స్ఫూర్తి కోసం మ‌న అడ‌వుల వంక దృష్టిసారించాలి. భూమికి ఊపిరితిత్తుల లాంటి మ‌న అర‌ణ్యాలు.. అట‌వీ నిర్మూల‌న‌, పారిశ్రామికేకీక‌ర‌ణ అనే విస్త‌రిస్తున్న మ‌హ‌మ్మారితో సుదీర్ఘ‌కాలం పోరాడుతున్నాయి. వ‌చ్చే సంక్రాంతికి మీ స‌మీపంలోని థియేట‌ర్ల‌కు వ‌స్తున్న `అర‌ణ్య‌`తో వాటిని కాపాడుకుందాం` అని మేక‌ర్స్ తెలిపారు. 25 ఏళ్లుగా అర‌ణ్యంలో జీవిస్తున్న ఓ మ‌నిషి క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.