అదిరిపోయిన “రానా” న్యూ లుక్ – “అరణ్య” మూవీ


Rana Daggubatis new film Haathi Mere Saathi
Rana Daggubatis new film Haathi Mere Saathi

బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా తరువాత రానా దగ్గుబాటి పలు భారతీయ బాషలలోకి విడుదల అవుతున్న సినిమా “హాథీ మేరే సాథీ”. తమిళంలో “కాదన్” అనీ, తెలుగులో “అరణ్య” పేరుతో ఈ సినిమా విడుదల అవుతోంది. గతంలో ధనుష్ తో “తొడరి” (తెలుగు లో “రైల్”) అనే డిఫరెంట్ సినిమా చేసిన ప్రభు సాల్మన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి రానా లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో రానా ఆదిజాతి యోధుడు “బన్ దేవ్” గా కనిపిస్తున్నారు.

మనుషులు నానాటికి ఆధిపత్యం పోరు, అహంకారం, స్వార్ధం పెరిగిపోయి చివరకు అడవులను కూడా ఆక్రమించి వన్య సంపదను దోచుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు. ఇక అందులో భాగంగా అడవుల్లో ఉండే భారీ ప్రాణులైన ఏనుగుల మనుగడకు ప్రమాదం వాటిల్లుతుంది. అప్పుడు ఆ అడవిని అమ్మ లాగా కాపాడుకునే ఒక వ్యక్తి (హీరో) ఏం చేసాడు.? అడవిని మనుషుల నుండి ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమా కథగా తెలుస్తోంది.

“సేవ్ ది ఫారెస్ట్” అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఇప్పటికే అటవీ సంరక్షణ అనే సబ్జెక్ట్ మీద మంచి సినిమాలు వచ్చాయి. వాటిలో ఇటీవల కాలంలో పృధ్వీరాజ్ & ప్రభుదేవా కాంబినేషన్ లో  మలయాళం లో వచ్చిన “ఉరుమి”, తమిళ హీరో ఆర్య, హీరోయిన్ కేథరిన్ తెరిస్సా  కాంబినేషన్ లో వచ్చిన “కదంబన్” ఉన్నాయి. ఇక ఈ సినిమా (హాథీ మేరే సాథీ) ను ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నట్లు యూనిట్ అనౌన్స్ చేసింది.