`విరాట‌ప‌ర్వం` గ్లింప్స్‌: స‌త్యాన్వేష‌ణ‌లో నెత్తురోడిన ర‌వ‌న్న‌


`విరాట‌ప‌ర్వం` గ్లింప్స్‌: స‌త్యాన్వేష‌ణ‌లో నెత్తురోడిన ర‌వ‌న్న‌
`విరాట‌ప‌ర్వం` గ్లింప్స్‌: స‌త్యాన్వేష‌ణ‌లో నెత్తురోడిన ర‌వ‌న్న‌

రానా ద‌గ్గుబాటి హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `విరాట‌ప‌ర్వం`. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. డి. సురేష్‌బాబు స‌మర్ప‌ణ‌లో శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై చెరుకూరి సుధాక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి మునుపెన్న‌డూ చూడ‌ని కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో ఉత్త‌ర తెలంగాణలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

రానా బ‌ర్త్‌డే ఈ రోజు. ఈ సంద‌ర్భంగా ఉద‌యం రానా ఫ‌స్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. డా.ర‌విశంక‌ర్ అలియాస్ కామ్రేడ్ ర‌‌వ‌న్న పాత్ర‌లో న‌క్స‌లైట్‌గా రానా స‌రికొత్త పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. ఉద్య‌మ నాయ‌కుడిగా ఏకే ప‌ట్టుకుని అలీవ్ గ్రీన్ డ్రెస్‌లో రానా క‌నిపిస్తున్న తీరు సినిమాపై భారీ అంచ‌నాల్ని పెంచేసింది.  చీక‌టి తెర‌ల్ని చీల్చుకుంటూ వెలుగులోకి వ‌స్తున్న రానా లుక్ ఆక‌ట్టుకుంటోంది. అనంత‌రం ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్‌ని కూడా మేక‌ర్స్ రిలీజ్ చేశారు. డా. ర‌విశంక‌ర్ కామ్రేడ్ ర‌వ‌న్న‌గా మార‌డానికి గ‌ల కార‌ణాలేంటీ?  న‌లుగురికి వైద్యం చేసే ఓ డాక్ట‌ర్ ఉద్య‌మ ప్ర‌స్థానం వైపు అడుగ‌గులు వేయ‌డానికి ప్రేరేపించిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

తెలుగు నేల న‌డిచిన‌‌ కొత్త దారుల నెత్తుటి ఙ్ఞాపకం.. మ‌న‌లోంచి మ‌న‌కోసం సాగిన ఓ చారిత్ర‌క సంధ‌ర్భం … విరాటప‌ర్వం. దేశం ముందు ఒక ప్ర‌శ్న‌గా నిల‌బ‌డ్డ జీవితం అత‌నిది. స‌త్యాన్వేష‌ణ‌లో నెత్తురోడిన హృద‌యం అత‌నిది అంటూ డా. ర‌విశంక‌ర్ అలియాస్ కామ్రేడ్ ర‌వ‌న్న త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌స్తున్నార‌ని ఫ‌స్ట్ గ్లింప్స్‌లో చూపించారు. ఫ‌స్ట్ గ్లింప్స్ చూస్తుంటే పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ హిస్టరీని క్రియేట్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.