టాటూతో అప్పుడే వైర‌ల్ అవుతోంది!


టాటూతో అప్పుడే వైర‌ల్ అవుతోంది!
టాటూతో అప్పుడే వైర‌ల్ అవుతోంది!

టాలీవుడ్‌లో వున్నమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రానా. ఈ ఆర‌డుగుల ఆజానుభాహుడి వివాహం ఎప్ప‌డెప్పుడు జ‌రుగుతుందా అని టాలీవుడ్‌తో పాటు సినీ ప్రియులు ఎదురుచూశారు. హాలీవుడ్ హంక్ ల‌కి ఏమాత్రం తీసిపోని మ‌న బ‌ల్లాలుడిని వివాహం ఆడ‌బోయే అమ్మాయి ఎవ‌రా అని అంత‌టా చ‌ర్చ జ‌రిగింది. చివ‌రికి బాలీవుడ్ క్రేజీ నిర్మాత క‌మ్ డైరెక్ట‌ర్ క‌ర్‌జోహార్ కూడా త‌న షోలో ప్ర‌ధానంగా ఈ విష‌యాన్నే ప్ర‌స్తావించిన ఇష‌యం తెలిసింది.

మొత్తానికి రానా పెళ్లిపీట‌లెక్క‌బోయే స‌మ‌యం వ‌చ్చేసింది. త‌ను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న మిహికా బ‌జాజ్ తో క‌లిసి వున్న ఫొటోని షేర్ చేస్తూ రానా త‌న పెళ్లి వార్త‌ని వెల్ల‌డించి అంద‌రికి షాకిచ్చారు. ఈ నెల 12న త‌ను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని, త‌న‌కు మిహీకా ఓకే చెప్పింద‌ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. బుధ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు వీరిద్ద‌రి నిశ్చితార్థం అత్యంత స‌న్నిహితులు పాల్గొన‌గా రామానాయుడు స్టూడియోస్‌లో జ‌రిగింది.

ఇదిలా వుంటే మిహికా వేసుకున్న టాటూ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎంగేజ్‌మెంట్ జ‌రిగి కొన్ని గంట‌లు గ‌డ‌వ‌కుండానే ఒక‌రంటే ఒక‌రికి ఏ స్థాయిలో ప్రేమ వుందో సింబాలిక్‌గా చెప్పేస్తున్నారు. ఇందులో భాగంగా మిహికా భ‌ర్త రానా పేరులోని తొలి అక్ష‌రం.. త‌న పేరుతోని తొలి అక్ష‌రంని.. మ‌ధ్య‌లో ల‌వ్ సింబ‌ల్ క‌నిపించేలా వేసుకున్న టాటూ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో వైర‌ల్‌గా మారింది.