రానా కు ఏమైంది


rana going to america for eye operation బాహుబలి తో రానా రేంజ్ పూర్తిగా మారిపోయింది , దాంతో చాలా సంతోషంగా ఉన్నాడు అయితే తాజాగా రానా ఓ సమస్య తో తీవ్రంగా బాధపడుతున్నాడట . ఇన్నాళ్లు ఆ బాధని భరించాడు కానీ ఇంకా కాలయాపన చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని భావించి అమెరికా వెళుతున్నాడు . అసలు రానా పడుతున్న ఇబ్బంది ఏంటో తెలుసా ……. కంటి తో . రానా కు ఒక కన్ను సరిగ్గా కనబడదు , ఒక కంటి మీదే ఆధారపడుతున్నాడు పాపం .

అయితే ఇన్నాళ్లు మేనేజ్ చేసాడు కానీ ఇప్పుడు మాత్రం కంటి బాధని భరించలేక పోతున్నాడట అందుకే కంటి ఆపరేషన్ కోసం అమెరికా యాత్ర చేస్తున్నాడు . అమెరికాలో అధునాతన వైద్యం అందుబాటులో ఉంది కాబట్టి ఇన్నాళ్లు తనకంటి కి సంబందించిన వివరాలన్నీ తెలుసుకుంటూ సరైన ఆసుపత్రి ఏదో తెలుసుకున్నాడట . కంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు . ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించనున్నాడు రానా .