ఆ మూవీ కోసం 30 కిలోలు త‌గ్గిన రానా!


ఆ మూవీ కోసం 30 కిలోలు త‌గ్గిన రానా!
ఆ మూవీ కోసం 30 కిలోలు త‌గ్గిన రానా!

`బాహుబ‌లి` కోసం బ‌రువు పెరిగి మెలితిప్పిన కండ‌ల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచిన రానా ఆ సినిమాతో భ‌ల్లాల దేవుడిగా ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో రానా క్రేజ్ మ‌రింత‌గా పెరిగిపోయింది. దీంతో ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న సినిమాల‌న్నీ పాన్ ఇండియా స్థాయిలోనే వుంటున్నాయి. ప్ర‌స్తుతం వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో `విరాట‌ప‌ర్వం` చేస్తున్న రానా దీనితో పాటు హాథీ మేరె సాథీ` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ నాలుగు భాష‌ల్లో రూపొందుతోంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

త‌మిళ ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగులో `అర‌ణ్య‌`గా త‌మిళంలో `కాడ‌న్‌` పేరుతో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం రానా ఏకంగా 30 కిలోల బ‌రువు త‌గ్గార‌ట‌. ఇందు కోసం క‌ఠిన‌మైన ఆహార నియ‌మాల్ని పాటించార‌ని, ద‌ర్శ‌కుడు చెప్పిన లుక్ లోకి రావ‌డం కోసం కాస్త క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించారని తెలుస్తోంది. సినిమాలో రానా భాణాదేవ్ అనే అడ‌వి మ‌నిషిగా వ‌ణ్య‌ప్రాణి ర‌క్ష‌ణ కోసం పోరాడే వ్య‌క్తిగా కొత్త అవ‌తారంలో క‌నిపిస్తున్నారు.

ఈ లుక్ కోసం ప‌లు లుక్ టెస్ట్‌లు నిర్వ‌హించిన ద‌ర్శ‌కుడు చివ‌రికి గ్రే హెయిర్‌, లాంగ్ బియ‌ర్డ్ లుక్‌ని ఫైన‌ల్ చేశార‌ట‌. ఆ లుక్‌లో రానా కొత్త‌గా క‌నిపిస్తార‌ని. అడ‌వి అందాల నేప‌థ్యంలో స‌రికొత్తగా తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల‌కు స‌రికొత్త అనేభూతిని ఇవ్వ‌నుంద‌ని చిత్ర బృందం చెబుతోంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 2న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల విడుద‌ల కానుంది.