రానా గేర్ మార్చేశాడు.. ఇక తగ్గేలా లేడు


Rana Daggubati
రానా గేర్ మార్చేశాడు.. ఇక తగ్గేలా లేడు

రానా దగ్గుబాటి సినీ ప్రయాణం విభిన్నంగా సాగుతుంటుంది. ఒక్క తెలుగు సినిమాకే పరిమితమైపోకుండా తమిళ్, హిందీ ఇలా అవకాశం ఎక్కడ వస్తే అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్క హీరో అనే ఫిక్స్ అయిపోకుండా విలన్, క్యారెక్టర్ రోల్, గెస్ట్ అప్పీయరెన్స్ ఇలా ఏది నచ్చితే అది చేసేస్తారు. బాహుబలి తర్వాత రానా బిజీ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం షూటింగ్ లో వివిధ దశల్లో రానా నటిస్తున్న మూడు చిత్రాలు ఉన్నాయి. మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

ఇంత బిజీలో కూడా రానా మరో సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ లో గృహం సినిమా తీసిన మిలింద్ రావు, రానాకు చేతబడుల నేపథ్యంలో ఒక హారర్ కథను చెప్పాడట. దీనికి ఎస్ అన్న రానా వెంటనే పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నుండి ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రానా నటిస్తున్న విరాటపర్వం నవంబర్ తో పూర్తైపోతుంది. గుణ శేఖర్ తో హిరణ్యకశ్యప చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇది వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. హాథీ మేరె సాథీ, 1945 చిత్రాలు షూటింగ్ లో ఉన్నాయి. అదీ సంగతి.