ప్రభాస్, రానా కలిసి పనిచేయబోతున్నారా?


ప్రభాస్, రానా కలిసి పనిచేయబోతున్నారా?
ప్రభాస్, రానా కలిసి పనిచేయబోతున్నారా?

ఈ లాక్ డౌన్ కాదు కానీ కొన్ని క్రేజీ రూమర్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇండస్ట్రీలో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఒక చిత్రాన్ని అంగీకరించాడట. ఇప్పటికే రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ డియర్ చిత్రాన్ని చేస్తున్న ప్రభాస్, రీసెంట్ గా నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిన విషయం తెల్సిందే. ఇదిలా ఉండగా ప్రభాస్ దశరధ్ దర్సకత్వంలో నటించనున్నాడని అంటున్నారు. వీరిద్దరూ కలిసి గతంలో చేసిన mr. పెర్ఫెక్ట్ సినిమా భారీ హిట్ గా నిలిచింది. సో ప్రస్తుతం దశరధ్ ఫామ్ లో లేకపోయినా ఈ సినిమాపై బజ్ అయితే బాగానే ఉంది.

ఇంతటితో అయిపోలేదు. ఈ సినిమాలో ప్రభాస్ కు ధీటుగా ఉండే విలన్ పాత్రలో రానా కనిపించనున్నాడని అంటున్నారు. బాహుబలి అంత పెద్ద హిట్ అవ్వడానికి చాలానే కారణాలు ఉన్నా అందులో రానా విలనిజం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. బాహుబలికి ధీటుగా ఉండే భల్లాలదేవ పాత్రలో రానా జీవించేసాడు. మరోసారి రానా, ప్రభాస్ ఢీ కొట్టబోతున్నారని అంటున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏమిటో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు.