బ్యాచిల‌ర్ లైఫ్‌కి నేటితో రానా బై బై చెప్పేస్తున్నాడు‌‌!బ్యాచిల‌ర్ లైఫ్‌కి నేటితో రానా బై బై చెప్పేస్తున్నాడు‌‌!
బ్యాచిల‌ర్ లైఫ్‌కి నేటితో రానా బై బై చెప్పేస్తున్నాడు‌‌!

ద‌గ్గుబాటి ఇంట్లో పెళ్లి హంగామా మొద‌లైంది. శ‌నివారం రానా, మిహీకాల వివాహం జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని రానా, మిహీకా బ‌జాజ్ ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. కోటి ఆశ‌ల‌తో ఈ జంట ఈ రోజు కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తోంది. పెళ్లి కోసం రామానాయుడు స్టూడియోస్ అందంగా ముస్తాబైంది. రంగు రంగుల పూల‌తో .. క‌ల‌ర్ క‌ల‌ర్ దీప కాంతుల‌తో స్టూడియోని కొన్ని రోజులకు ముందే ముస్తాబు చేశారు. వివాహం తాజ్ ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్‌లో అనుకున్నా చివ‌రి నిమిషంలో వేదిక మారింది.

రామానాయుడు స్టూడియోస్‌నే వివాహానికి వేదిక‌గా మార్చేశారు. పుఎళ్లికి ముందు హంగామా అంతా ఇక్క‌డే కావ‌డం, పెళ్లి కూడా ఇక్క‌డే జ‌ర‌గుతుండ‌టంతో రంగు రంగుల పూల‌తో, ర‌క‌ర‌కాల లైట్ల‌తో రామానాయుడు స్టూడియోస్ ప్రాంగ‌ణం అంతా కోటి కాంతుల‌తో త‌ళుకులీనుతోంది. హ‌ల్దీ వేడుక‌, మెహెందీ వేడుక క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. ఈ రెండు వేడ‌కల్లో రానా , మిహీకా సంద‌డి మామూలుగా లేదు. ఇద్ద‌రూ ఇద్ద‌రే న్న‌ట్టుగా ఆడి పాడి హంగామా చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

శ‌నివారం పెళ్లి కావ‌డంతో ముస్తాబై రానా క‌నిపించాడు. ప‌క్క‌న చిద్విలాసంతో క‌నిపిస్తున్న డి. సురేష్‌బాబు, బాబాయ్ వెంక‌టేష్ పెళ్లి కొడుకు రెడీ అన్న‌ట్టుగా పోజిచ్చిన రానా కు సంబంధించిన ఫొటో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటోంది. కోవిడ్ నిబంధ‌న‌ల్ని పాటిస్తూ అత్యంత క‌ట్టుదిట్టమైన వాతావ‌ర‌ణంలో రానా వివాహం జ‌ర‌గ‌బోతోంది. ఈ వేడుక‌కి రాజ‌మౌళి, ప్ర‌భాస్‌,  రామ్‌చ‌ర‌ణ్ తో పాటు మ‌రి కొంత మంది సినీ సెల‌బ్రిటీలు పాల్గొంటార‌ని తెలుస్తోంది. ఈ రోజుతో బ్యాచిల‌ర్ లైఫ్‌కు రానా బై బై చెప్పేస్తున్నాడని సోష‌ల్ మీడియాలో హంగామా మొద‌లైంది.