డియర్ కామ్రేడ్ ని అమెరికాలో చూస్తానంటున్న రానా 


Rana wishes to Vijay devarakonda
Rana wishes to Vijay devarakonda

డియర్ కామ్రేడ్ ని అమెరికాలో చూస్తానంటున్న రానా
రానా ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు దాంతో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని అమెరికాలోనే చూస్తానని అంటున్నాడు . అంతేనా విజయ్ దేవరకొండ కు ఆ చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందజేశాడు రానా . రేపు అమెరికాలో విడుదల కానుంది డియర్ కామ్రేడ్ చిత్రం , తెలుగు రాష్ట్రాలలో మాత్రం జూలై 26 నే విడుదల కానుంది .

అయితే రానా ప్రస్తుతం అమెరికాలో ఎందుకున్నాడంటే అనారోగ్యంతో బాధపడుతున్నాడు . కాగా చికిత్స కోసం అమెరికా వెళ్ళాడు రానా . అయితే అది ఏ చికిత్స అన్నది విమరించలేదు కానీ రానా తల్లి కిడ్నీ ఇచ్చిందని పుకార్లు షికారు చేస్తున్నాయి . ఇదే విషయాన్నీ కొంతమంది నెటిజన్లు రానా ని అడగడంతో అలాంటి వార్తలను చదవకండి అని సమాధానం ఇచ్చాడు కానీ అసలు విషయాన్నీ మాత్రం చెప్పలేదు మరి .