`అర‌ణ్య‌` ట్రైల‌ర్ టాక్‌: మ‌నిషి అత్యాశ‌కూ ప్ర‌కృతికి మ‌ధ్య వార్‌!

`అర‌ణ్య‌` ట్రైల‌ర్ టాక్‌: మ‌నిషి అత్యాశ‌కూ ప్ర‌కృతికి మ‌ధ్య వార్‌!
`అర‌ణ్య‌` ట్రైల‌ర్ టాక్‌: మ‌నిషి అత్యాశ‌కూ ప్ర‌కృతికి మ‌ధ్య వార్‌!

రానా ద‌గ్గుబాటి హీరోగా న‌టిస్తున్న చిత్రం `అర‌ణ్య‌`. ప్ర‌భు సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, పుల్కిత్‌స‌మ్రాట్‌, జోయా హుస్సేన్‌, శ్రియా పిల్గాంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈరోస్ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్నఈ చిత్రం ఈ నెల 26న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని రిలీజ్ చేసింది.

ఏనుగుల అవ‌స‌రాలు మ‌నుషుల అత్యాశ‌కు మ‌ధ్య సాగే పోరాటం నేప‌థ్యంలో ఈ చిత్రాన్నిపాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కించారు. రానా ఏనుగుల ర‌క్ష‌కుడిగా వుండే మావాటిగా క‌నిపించ‌నున్నారు. `ఏనుగులు మ‌న‌క‌న్నా చాలా తెలివైన‌వి. ఎంతో ఎమోష‌న‌ల్‌, సెంటిమెంట్‌, ఎంతో కేరింగ్ గ‌ల‌వి. అయితే ఏనుగుల‌న్నీ తాత‌య్య ఫ్రెండ్సా.. నాన్నా.. అయితే నువ్వు కూడా వాట‌ని ఫ్రెండ్స్‌గా చూసుకుంటావా? .. అనే డైలాగ్‌లు.. అడ‌వి అందాల‌తో `ఆర‌ణ్య‌` ఓ రేంజ్‌లో ఆక‌ట్టుకునేలా క‌నిపిస్తోంది.

ప్ర‌కృతిని ప్ర‌భుత్వం,, స‌మాజం త‌మ స్వ‌లాభం ఎలా నాశ‌నం చేస్తోందో క‌ళ్ల‌కు క‌డుతూ ప్ర‌శ్నించే ప్ర‌య‌త్నం చేశారు. `దేవుడా ఏం జ‌ర‌గ‌కూడ‌ద‌నుకున్నానో అదే ‌జ‌రిగింది. ఏనుగుల ఇంట్లో మ‌నుషుల అరాచ‌కం ఈ హెడ్డింగ్ పెట్టే గ‌ట్స్ వున్నాయా? ` అని రానా చెప్పే డైలాగ్‌లు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. తెలుగులో అర‌ణ్య‌గా, త‌మిళంలో కాండ‌న్‌గా, హిందీలో `హ‌థీ మేరా సాథీ`గా రిలీజ్ కాబోతోంది. శాంత‌న్ సంగీతం, రానా న‌ట‌న‌, అబ్బుర ప‌రిచే విజువ‌ల్స్‌.. ర‌సూల్ పోకుట్టి సౌండ్స్ ఈ చిత్రానికి ప్ర‌ధాన హైలైట్స్‌గా నిల‌వ‌నున్నాయి.