`విరాట‌ప‌ర్వం` రిలీజ్ డేట్ ఫిక్స్‌!

`విరాట‌ప‌ర్వం` రిలీజ్ డేట్ ఫిక్స్‌!
`విరాట‌ప‌ర్వం` రిలీజ్ డేట్ ఫిక్స్‌!

ద‌గ్గుబాటి రానా హీరోగా న‌టిస్తున్న రెవెల్యూష‌న‌రీ చిత్రం `విరాట‌ప‌ర్వం`. వేణు ఊడుగుల ద‌ర్శ‌‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రియ‌మ‌ణి, నందితాదాస్‌, న‌వీన్‌చంద్ర‌, జ‌రీనా వాహెబ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. డి. సురేష్‌ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో సురేష్‌ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఉత్త‌ర తెలంగాణ నేప‌థ్యంలో 90వ ద‌శ‌కంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. గురువారం చిత్ర బృందం ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించింది. స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ చిత్రాన్ని  ఏప్రిల్ 30న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది. న‌క్స‌లైట్ ఉద్య‌మం నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రానా కామ్రేడ్ ర‌వ‌న్న‌గా క‌నిపించ‌బోతున్నారు.

డాక్ట‌ర్ ర‌విశంక‌ర్ కామ్రేడ్ ర‌వ‌న్న‌గా మార‌డానికి గ‌ల కార‌ణాలేంటీ? ఈ ప్ర‌యాణంలో అత‌ను ఎదుర్కొన్న స‌వాళ్లేంట‌న్న‌దే ఈ చిత్ర క‌థ‌గా తెలుస్తోంది. సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌కు ఆస్కారం వున్న పాత్ర‌లో ఫోక్ సింగ‌ర్‌గా క‌నిపిసంచ‌బోతోంది. ఇప్ప‌టికే భారీ స్థాయిలో అంచ‌నాలు నెల‌కొన్ని ఈ చిత్రం స‌మ్మ‌ర్‌లో సంచ‌ల‌నం సృష్టించ‌గం ఖాయంగా క‌నిపిస్తోంది.