రానా, మిహికల పెళ్ళికి ప్యాలెస్ ని బుక్ చేశారా ?


రానా, మిహికల పెళ్ళికి ప్యాలెస్ ని బుక్ చేశారా ?
రానా, మిహికల పెళ్ళికి ప్యాలెస్ ని బుక్ చేశారా ?

టాలీవుడ్ లో వరుస పెళ్లిళ్ల  హంగామా నడుస్తోంది. ఇప్పటికే కొంత మంది పెళ్లిళ్లు చేసుకోగా మరికొంత మంది పెళ్ళి పీటలెక్కడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే హీరో నితిన్ మనసు మార్చుకుని వచ్చేనెల వివాహం చేసుకోవాలని ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే హీరో రానా ఆగస్టు లో పెళ్ళికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన మిహిక బజాజ్ ని రానా ఆగస్టు 8న వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే ఇరు కుటుంబాలు రాక ఫంక్షన్ ని నిర్వహించాయి కూడా. ప్రస్తుతం ఇరు కుటుంబాల వాళ్ళు పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆగస్టు 8న జరగబోయే రానా వెడ్డింగ్ కోసం హైదరాబాద్ లో ఫేమస్ అయినా ఫలక్ నుమా ప్యాలెస్ ని సురేష్ బాబు బుక్ చేసినట్టు తెలిసింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సేఫ్టీ ప్లేస్ లో వెడ్డింగ్ జరపాలని, ఆలా చేస్తేనే పెళ్ళికి వచ్చే అతిధులకు ఎలాంటి ప్రమాదం ఉండదని రానా, మిహికా భావిస్తున్నారట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్టు తాజా న్యూస్.