ఆలియా భట్ ని ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నాడు


Ranbir Kapoor Dating with alia bhatt

ఆలియా భట్ ని ప్రేమిస్తున్నానని ,ప్రస్తుతం ఇద్దరం డేటింగ్ చేస్తున్నామని అయితే అంతకు మించి చెప్పడానికి ఏమిలేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ . ఆలియా భట్ కంటే ముందు ఈ హీరో దీపికా పదుకునే ని ప్రేమించాడు , ఇక పెళ్లి కావడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో బ్రేకప్ అయ్యింది . దీపికా తర్వాత కత్రినా కైఫ్ ని ప్రేమించాడు రణబీర్ కపూర్ . కత్తిలాంటి కత్రినా కైఫ్ తో ఏకంగా కాపురమే పెట్టేసాడు రణబీర్ . ముంబై లోని బాంద్రా లో అత్యంత ఖరీదైన ఫ్లాట్ లో జోరుగా ప్రేమాయణం సాగించారు .

కట్ చేస్తే కత్రినా కైఫ్ తో బ్రేకప్ అయ్యింది , ఇంకేముంది దొరగారు ఖాళీ గా ఉన్నారు కాబట్టి ఆలియా భట్ ని ప్రేమలో దించేసాడు . రణబీర్ తో ఆలియా భట్ కూడా ప్రేమలో మునిగిపోయింది . ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి ” బ్రహ్మాస్త్ర ” అనే చిత్రంలో నటిస్తున్నారు . బ్రహ్మాస్త్ర సినిమాకు ముందే ఇద్దరి మధ్య మంచి అవగాహనా ఏర్పడింది దాంతో డేటింగ్ చేస్తూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు . తాజాగా ఓ మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆలియా తో డేటింగ్ గురించి చెప్పుకొచ్చాడు . అయితే ఈ ప్రేమ ఎంత కాలం ఉంటుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న .