నితిన్ `రంగ్‌దే` నుంచి ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది!

నితిన్ `రంగ్‌దే` నుంచి ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది!
నితిన్ `రంగ్‌దే` నుంచి ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది!

యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం `రంగ్ దే`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో నితిన్ ‌వెడ్డింగ్ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుతూ చిత్ర బృందం `రంగ్ దే` నుంచి చిన్న వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియో దాదాపుగా 14 మిలియ‌న్‌లకు పైగా వ్యూస్ సాధించింది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్ వీడియోని చిత్ర బృందం గురువారం రిలీజ్ చేసింది.
`ఏమిటో ఇది వివ‌రించ‌లేనిది.. మ‌ది ఆగ‌మ‌న్న‌ది త‌నువాగ‌న‌న్న‌ది…` అంటూ సాగే ప‌ల్ల‌వి గ‌ల గీతానికి శ్రీ‌మ‌ణి సాహిత్యం అందించారు. హ‌రిప్రియ‌, క‌పిల‌న్ లు ఆల‌పించారు. దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించారు. హీరో నితిన్‌, కీర్తిసురేష్‌ల‌పై రొమాంటిక్ మెలోడీగా వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు క‌లిగించేలా ఈ పాట‌ని ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి చిత్రీక‌రించారు.

ఈ నెల చివ‌రి వారం నుంచి ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీల‌క స‌న్నివేశాలు.. దుబాయ్‌లో పాటల‌ చిత్రీక‌ర‌ణతో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.