“రంగ్ దే..” ఫస్ట్ లుక్ పోస్టర్ రెడీ

 

Rang De First look poster tomorrow
Rang De First look poster tomorrow

భీష్మ సినిమా సక్సెస్ తర్వాత హీరో నితిన్ తాజా చిత్రం రంగ్ దే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పి.డి.వి ప్రసాద్ గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  సుప్రీం హీరో సాయి తేజ్ తో “తొలిప్రేమ” సినిమా దర్శకత్వం వహించి, తర్వాత యువ కథానాయకుడు అఖిల్ అక్కినేనితో “మిస్టర్ మజ్ను” సినిమా తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేశం గర్వించదగ్గ టెక్నీషియన్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ గారు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. పీసీ శ్రీరామ్ గారు గతంలో నితిన్ గారు హీరోగా నటించిన “ఇష్క్” సినిమాకు కూడా సినిమాటోగ్రఫీ అందించారు. ఇక హారిక హాసిని బ్యానర్ అధినేత రాధాకృష్ణ (చిన్నబాబు) గారి తనయుడు సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రేపు సాయంత్రం విడుదల చేస్తారని సినిమా యూనిట్ ప్రకటించింది.

ఇటీవల విడుదలైన నితిన్ గారి తాజా చిత్రం భీష్మ సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం “రంగ్ దే” సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ కు కూడా అంతరాయం కలిగింది. అయితే ఫ్యాన్స్ కు సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలనే ఆలోచనతో సినిమా టీం రేపు సాయంత్రం “రంగ్ దే” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తామని ప్రకటించింది.