అను & అర్జున్ ల ప్రేమ కథ – “రంగ్.. దే” మోషన్ పోస్టర్


అను & అర్జున్ ల ప్రేమ కథ – “రంగ్.. దే” మోషన్ పోస్టర్
అను & అర్జున్ ల ప్రేమ కథ – “రంగ్.. దే” మోషన్ పోస్టర్

నితిన్ కథానాయకుడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పి.డి.వి ప్రసాద్ గారి సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత రాధాకృష్ణ (చిన్నబాబు) గారి తనయుడు సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం “రంగ్ దే”. రేపు అనగా మార్చి నెల 30వ తేదీ హీరో నితిన్ పుట్టినరోజు పురస్కరించుకొని ఈ సినిమాకు చెందిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఇక మోషన్ పోస్టర్ లో భాగంగా చిత్రంలోని హీరో హీరోయిన్ క్యారెక్టర్లు అయిన “అను” మరియు “అర్జున్” లను పరిచయం చేశారు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా ప్రేమకథలు చేసి సక్సెస్ అవుతున్న నితిన్ మళ్లీ ఈసారి మరొక అద్భుతమైన ప్రేమ కథ ద్వారా మన ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. “తొలిప్రేమ”, “మిస్టర్ మజ్ను” ఇలాంటి విభిన్నమైన ప్రేమ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి మళ్లీ మరొకసారి సరికొత్త ప్రేమకథ తో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరగడానికి మరో కారణం సినిమాటోగ్రఫీ చేస్తున్న గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పి.సి శ్రీరామ్ గారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరొక అద్భుతమైన ట్యూన్ తో ఈ మోషన్ పోస్టర్ లో మనల్ని ఆకట్టుకున్నారు. కరోనా వైరస్ దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందకుండా 21 రోజుల పాటు లాక్ డౌన్ నేపథ్యంలో సినిమాలకు సంబంధించిన అన్ని రకాల పనులు వాయిదా పడ్డాయి కాబట్టి.. ప్రస్తుతం ఈ సినిమా అనుకున్న షెడ్యూల్ కు కాకుండా మరొక కొత్త విడుదల తేదీ ప్రకారం మన ముందుకు వచ్చే అవకాశం ఉంది.